Nagarjuna Sagar: నాగార్జునసాగర్ కు పెరిగిన ప్రవాహం.. ఈ నెలలోనే డ్యాం నిండే అవకాశం

ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలు, వరదలతో నాగార్జునసాగర్ (Nagarjuna Sagar) కు ప్రవాహం మొదలైంది. శ్రీశైలం డ్యాం నుంచి 27,569 క్యూసెక్కుల నీరు వస్తోంది. తుంగభద్ర జలాశయం నిండటం, జూరాల నుంచి నీటి విడుదలతో శ్రీశైలం నీటిమట్టం క్రమంగా...

Nagarjuna Sagar: నాగార్జునసాగర్ కు పెరిగిన ప్రవాహం.. ఈ నెలలోనే డ్యాం నిండే అవకాశం
Nagarjuna Sagar

Updated on: Jul 21, 2022 | 1:41 PM

ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలు, వరదలతో నాగార్జునసాగర్ (Nagarjuna Sagar) కు ప్రవాహం మొదలైంది. శ్రీశైలం డ్యాం నుంచి 27,569 క్యూసెక్కుల నీరు వస్తోంది. తుంగభద్ర జలాశయం నిండటం, జూరాల నుంచి నీటి విడుదలతో శ్రీశైలం నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. వరద ఇలాగే కొనసాగితే త్వరలోనే శ్రీశైలం (Srisailam) 885 అడుగులకు చేరుకునే అవకాశం ఉంది. కాగా.. నాగార్జునసాగర్ లో ప్రస్తుతం 176.67 టీఎంసీల నీరు నిల్వ ఉంది. సాగర్ కు ఎగువన ఉన్న జలాశయాలు నిండుకుండలా మారుతుండటంతో జులై నెలలోనే సాగర్ కు వరద భారీగా పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. వీటిని దృష్టిలో ఉంచుకుని త్వరలోనే సాగర్‌ కాలువలకు నీరు విడుదల చేయనున్నారు. ప్రభుత్వం ముందస్తుగా ప్రకటించిన విధంగా జూలై 15న సాగర్‌ కాలువలకు నీటిని విడుదల చేయాల్సి ఉంది. అయితే అప్పటికి నీటిలభ్యతపై స్పష్టత లేకపోవడంతో నీటిని విడుదల చేయలేదు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 534 అడుగులకు చేరుకుంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిలువ 176 టీఎంసీలకు చేరుకుంది.

మరోవైపు.. శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద వస్తోంది. 215.81 టీఎంసీల సామర్థ్యం ఉన్న ఈ రిజర్వాయర్ లో నీటి నిల్వ బుధవారం రాత్రి 8 గంటల వరకు 180 టీఎంసీకు చేరింది. భారీ వరదలతో ఉగ్రరూపం దాల్చిన గోదావరి ఇప్పుడిప్పుడే శాంతిస్తోంది. ఎస్సారెస్పీ వరద కాలువ నుంచి మిడ్ మానేరుకు నీటిని విడుదల చేస్తున్నారు. మేడిగడ్డ బ్యారేజీకి గోదావరి నుంచి లక్షన్నర, ప్రాణహిత 6.80 లక్షలు కలిపి 8.62 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి