Hyderabad: రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. మారనున్న హైదరాబాద్ రూపు రేఖలు..!
హైదరాబాద్ మహానగరంలో మార్పు మార్క్.. మూసీ ప్రక్షాళన ప్రతిష్టాకంగా చేపట్టిన తెలంగాణ ప్రభుత్వం, కేబీఆర్ పార్క్ చుట్టూ రోడ్ల విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అండర్ పాస్, ఫ్లై ఓవర్ల నిర్మానానికి అనమతి ఇస్తూ జీవో జారీ చేసింది
హైదరాబాద్ మహానగరంలో మార్పు మార్క్.. మూసీ ప్రక్షాళన ప్రతిష్టాకంగా చేపట్టిన తెలంగాణ ప్రభుత్వం, కేబీఆర్ పార్క్ చుట్టూ రోడ్ల విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అండర్ పాస్, ఫ్లై ఓవర్ల నిర్మానానికి అనమతి ఇస్తూ జీవో జారీ చేసింది. మరోవైపు స్పోర్ట్స్ పాలసీపై కూడా మరింత ఫోకస్ పెంచారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
కేబీఆర్ పార్క్ జంక్షన్ నుంచి ఐదు అండర్ పాస్ ఫ్లై ఓవర్లు, కేబీఆర్ పార్క్ చుట్టూ రేడియల్ రోడ్ల విస్తరణకు లైన్ క్లియర్ అయింది. KBR పార్క్ చుట్టూ 6 జంక్షన్ల అభివృద్ధికి రేవంత్ సర్కార్ ఆమోదం తెలిపింది. కెబిఆర్ పార్క్ ఎంట్రన్స్ నుండి.. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, రోడ్ 45, ఫిలింనగర్, అగ్రసేన్ మహరాజ్ విగ్రహం, బసవతారకం లవైపు అండర్ పాస్ ఫ్లై ఓవర్ల నిర్మాణం చేపడుతారు. రూ.826 కోట్లతో ఆరు జంక్షన్ల అభివృద్ధి చేపట్టనున్నారు. తొలి దశలో 421 కోట్లతో ప్యాకేజీ-1లో జూబ్లిహిల్స్ చెక్ పోస్ట్..కేబీఆర్ పార్క్ ఎంట్రెన్స్ దగ్గర జంక్షన్లను అభివృద్ధి చేస్తారు.
యూసఫ్‌గూడ వైపు నుంచి రోడ్డు నెం.45 జంక్షన్ వరకు రెండు లైన్ల ప్లైఓవర్లను నిర్మిస్తారు. కేబీఆర్ ఎంట్రెన్స్ ముగ్ధ జంక్షన్ జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు నుంచి క్యాన్సర్ హాస్పిటల్ జంక్షన్ వరకు 2 లేన్ల అండర్‌పాస్ నిర్మిస్తారు. పంజాగుట్ట వైపు నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వరకు మూడు లేన్ల ప్లైఓవర్, కేబీఆర్ ఎంట్రెన్స్ జంక్షన్ నుంచి పంజాగుట్ట వైపు మూడు లేన్ల అండర్ పాస్ ఏర్పాటు చేస్తారు.
405కోట్లతో ప్యాకేజీ-2లో.. రోడ్ నెం.45 జంక్షన్‌ను అభివృద్ధి చేస్తారు. రెండో దశలో రోడ్ నెంబర్ 45, ఫిల్మ్ నగర్ జంక్షన్ నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వైపు వరకు అండర్ పాస్ నిర్మిస్తారు. జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు నుంచి రోడ్ నెంబర్-45 వరకు రెండు లైన్ల ఫ్లైఓవర్ ఫిలింనగర్ జంక్షన్ 1, అగ్రసేన్ జంక్షన్ నుంచి రోడ్ నెం.45 జంక్షన్ వరకు 2 లైన్ల అండర్‌పాస్ అభివృద్ధి చేస్తారు. ఫిలింనగర్ జంక్షన్ నుంచి అగ్రసేన్ జంక్షన్ వరకు రెండు లైన్ల ఫ్లైఓవర్ నిర్మాణంతోపాటు మహారాజా అగ్రసేన్ జంక్షన్ 1. క్యాన్సర్ హాస్పిటల్ జంక్షన్ నుంచి ఫిలింనగర్ జంక్షన్ వరకు అండర్ పాస్ నిర్మిస్తారు. ఫిలింనగర్ జంక్షన్ నుంచి రోడ్ నెంబర్-12 వరకు రెండు లైన్ల ఫ్లైఓవర్, క్యాన్సర్ హాస్పిటల్ జంక్షన్ 1. కేబీఆర్ పార్కు నుంచి అగ్రసేన్ జంక్షన్ వరకు రెండు లైన్ల అండర్ పాస్ అభివృద్ది చేస్తారు. అగ్రసేన్ జంక్షన్ నుంచి రోడ్డు నెంబర్-10 వరకు రెండు లైన్ల ఫ్లైఓవర్ నిర్మిస్తారు. ఇప్పటికే పరిపాలన అనుమతులు వచ్చేశాయి. ఇన పనుల వేగవంతమే తరువాయి. అండర్ పాస్ ఫ్లై ఓవర్లు ,రేడియల్ రోడ్లతో కేబీఆర్ ఏరియా రూపురేఖలు ఇక మరో లెవల్‌గా మారనున్నాయి.
క్రీడాభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
మరోవైపు నగరాభివృద్ధి సహా అటు క్రీడాభివృద్ధిపై కూడా ఫోకస్ పెట్టారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్‌ను అంతర్జాతీయ క్రీడా వేదికగా తయారు చేయడం సహా క్రీడాకారులకు మరింత ప్రొత్సాహాం అందించాలనే లక్ష్యంతో స్పోర్ట్స్ పాలసీపై దృష్టిసారించారు సీఎం. క్రీడాకారులకు మెరుగైన శిక్షణ అందించేలా స్పోర్ట్స్ వర్సిటీ , యంగ్ ఇండియా కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తామన్నారు. దక్షిణ కొరియా కోచ్‌లో శిక్షణ ఇప్పిస్తామన్నారు. చెప్పడమే కాదు స్పోర్ట్స్ పాలసీపై ఫుల్‌గా ఫోకస్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..