TGSRTC: అక్కాచెల్లెమ్మలకు ఆర్టీసీ సదవకాశం.. 24 గంటల్లో రాఖీలు డెలివరీ అయ్యేలా..

తోబుట్టువులు ఎంతో సంతోషంగా జరుపుకునే పండుగ రాఖీ. ఏడాదంతా ఎక్కడున్నా ఈ ఒక్క రోజైనా కచ్చితంగా అన్నాచెల్లెల్లు, అక్కతమ్ముల్లు కచ్చితంగా కలుసుకుంటారు. రాఖీతో తమ బంధాన్ని చాటుకుంటారు. అయితే దూరంగా ఉన్న వారి పరిస్థితి ఏంటి.? ఇలాంటి వారి కోసమే తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం తెలంగాణ ఆర్టీసీ అందిస్తోన్న..

TGSRTC: అక్కాచెల్లెమ్మలకు ఆర్టీసీ సదవకాశం.. 24 గంటల్లో రాఖీలు డెలివరీ అయ్యేలా..
Tgrtc
Follow us
Narender Vaitla

| Edited By: TV9 Telugu

Updated on: Aug 12, 2024 | 11:18 AM

తోబుట్టువులు ఎంతో సంతోషంగా జరుపుకునే పండుగ రాఖీ. ఏడాదంతా ఎక్కడున్నా ఈ ఒక్క రోజైనా కచ్చితంగా అన్నాచెల్లెల్లు, అక్కతమ్ముల్లు కచ్చితంగా కలుసుకుంటారు. రాఖీతో తమ బంధాన్ని చాటుకుంటారు. అయితే దూరంగా ఉన్న వారి పరిస్థితి ఏంటి.? ఇలాంటి వారి కోసమే తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం తెలంగాణ ఆర్టీసీ అందిస్తోన్న కార్గో సేవలను విస్తరిస్తున్నారు.

ఇందులో భాగంగానే రాఖీ పండుగ‌కు నాలుగైదు రోజుల ముందు నుంచి కార్గో సెంట‌ర్ల‌లో ప్ర‌త్యేక కౌంట‌ర్లు తెరిచేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీంతో దూర ప్రాంతాల్లో ఉన్న తమ తోబుట్టువులకు రాఖీలను సులభంగా పంపించేందుకు వీలు కల్పించనున్నారు. రాఖీలతో పాటు స్వీట్ బాక్సులు, బహుమతులు, ఇతర సామగ్రిని కూడా పంపే అవ‌కాశం ఉందని ఆర్టీసీ అధికారులు తెలిపారు. కేవలం తెలంగాణ మాత్రమే కాకుండా దగ్గరల్లోని.. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ట్రాలకు కూడా రాఖీలను పంపించుకునే వెసులుబాటును కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ఇందులో భాగంగానే రాష్ట్రంలోని అన్ని బస్టాండ్స్‌లోని కార్గో సెంటర్స్‌లో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేయనున్నారు. అంతేకాకుండా కార్గో సెంటర్స్‌లో ప్యాకింగ్‌ను ఇచ్చిన 24 గంటల్లోనే డెలివరీ చేసేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం అంతా సిద్ధంగా ఉన్నా.. రాఖీల రవాణాకు సంబంధించి ఇంకా ధర ఖరారు చేయని కారణంగా, ఉన్నతాధికారుల అనుమతి కోసం చూస్తున్నారు. అయితే ఇందుకోసం ఎంత ఛార్జీలు వసూలు చేస్తారన్న దానిపై వచ్చే సోమవారం స్పష్టత రానుందని తెలుస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

భారత్‌-జర్మనీ మధ్య సుస్థిర అభివృద్ధికి రోడ్‌మ్యాప్‌..!
భారత్‌-జర్మనీ మధ్య సుస్థిర అభివృద్ధికి రోడ్‌మ్యాప్‌..!
రాజకీయాలకు పోసాని గుడ్‌బై.. ఇకపై ఆఖరి శ్వాస వరకు..
రాజకీయాలకు పోసాని గుడ్‌బై.. ఇకపై ఆఖరి శ్వాస వరకు..
పుష్ప2 కోసం ఏకంగా నలుగురు మ్యూజిక్ డైరెక్టర్స్.! సుక్కు దెబ్బ అది
పుష్ప2 కోసం ఏకంగా నలుగురు మ్యూజిక్ డైరెక్టర్స్.! సుక్కు దెబ్బ అది
మనబొమ్మ అదుర్స్.. బాలీవుడ్‌ బెదుర్స్.! ఫిల్మ్ ఇండస్ట్రీ పై టాలీవు
మనబొమ్మ అదుర్స్.. బాలీవుడ్‌ బెదుర్స్.! ఫిల్మ్ ఇండస్ట్రీ పై టాలీవు
మీ రివ్యూ మీ ఇష్టమైతే.. మా సినిమా మా ఇష్టం.! రివ్యూవర్స్‌పై
మీ రివ్యూ మీ ఇష్టమైతే.. మా సినిమా మా ఇష్టం.! రివ్యూవర్స్‌పై
జక్కన్న సంగతి తెలిసిందేగా.. SSMB29 ఇప్పట్లో లేనట్లేనా.?
జక్కన్న సంగతి తెలిసిందేగా.. SSMB29 ఇప్పట్లో లేనట్లేనా.?
బన్నీ,సుకుమార్‌ దేవీశ్రీ ని పక్కన పెట్టేశారా? మధ్యలో తమన్ ఎందుకు?
బన్నీ,సుకుమార్‌ దేవీశ్రీ ని పక్కన పెట్టేశారా? మధ్యలో తమన్ ఎందుకు?
వామ్మో.. అనుష్క.! వయసు 43ఏళ్లే.. కానీ సంపాదన 140 కోట్లు.!
వామ్మో.. అనుష్క.! వయసు 43ఏళ్లే.. కానీ సంపాదన 140 కోట్లు.!
ఇండియాలోనే పరమ చెత్త సినిమా.. 45కోట్లు పెడితే 70 వేల కలెక్షన్స్‌.
ఇండియాలోనే పరమ చెత్త సినిమా.. 45కోట్లు పెడితే 70 వేల కలెక్షన్స్‌.
శివునికి నమస్కరిస్తూ కుప్పకూలిపోయిన వ్యక్తి... CPR చేసినా..
శివునికి నమస్కరిస్తూ కుప్పకూలిపోయిన వ్యక్తి... CPR చేసినా..