Telangana: టెట్ సరే.. మరి టీఆర్‌టీ నోటిఫికేషన్ ఎప్పుడో..! టీచర్ అభ్యర్ధుల్లో ఆందోళన..!

Telangana: ప్రభుత్వ ఉద్యోగాల్లో కీలకమైన విద్యాశాఖలో అయితే టీచర్ల ఖాళీలు కూడా కోకొల్లలు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 20 వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులకు ఖాళీలు ఉన్నాయి. దీంతో ఎన్నికల ముందు టీచర్ రిక్రూట్ మెంట్ టెస్ట్ (TRT) నోటిఫికేషన్ వస్తుందని అంతా ఆశగా ఎదురు చూశారు. కానీ ఇటీవల కెబినెట్ సబ్ కమిటీ తీసుకున్న నిర్ణయంతో అంతా అవాక్కాయ్యారు. గతేడాది టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET)ని నిర్వహించిన ప్రభుత్వం అందులోనే..

Telangana: టెట్ సరే.. మరి టీఆర్‌టీ నోటిఫికేషన్ ఎప్పుడో..! టీచర్ అభ్యర్ధుల్లో ఆందోళన..!
TRT Exam Candidates
Follow us
Vidyasagar Gunti

| Edited By: శివలీల గోపి తుల్వా

Updated on: Aug 09, 2023 | 11:41 AM

హైదరాబాద్, ఆగస్టు 9: తెలంగాణలో వరుస ఉద్యోగాల నోటిఫికేషన్లతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. టీఎస్‌పీఎస్‌సీ, పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు, ఇతర బోర్డులు వేలాది సంఖ్యలో ఉద్యోగాలకు నోటిఫికేషన్లు, పరీక్షలతో దూసుకెళ్తున్నాయి. అలాగే ప్రభుత్వ ఉద్యోగాల్లో కీలకమైన విద్యాశాఖలో అయితే టీచర్ల ఖాళీలు కూడా కోకొల్లలు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 20 వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులకు ఖాళీలు ఉన్నాయి. దీంతో ఎన్నికల ముందు టీచర్ రిక్రూట్ మెంట్ టెస్ట్ (TRT) నోటిఫికేషన్ వస్తుందని అంతా ఆశగా ఎదురు చూశారు. కానీ ఇటీవల కెబినెట్ సబ్ కమిటీ తీసుకున్న నిర్ణయంతో అంతా అవాక్కాయ్యారు.

గతేడాది టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET)ని నిర్వహించిన ప్రభుత్వం అందులోనే పాసైన వారికి లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ ఇచ్చారు. అందులో లక్ష మందికి పైగా అభ్యర్థులు అర్హత సాధించారు. ఇక అంతకు ముందే అర్హత సాధించిన వారితో కలుపుకుంటే కొన్ని లక్షల్లో నిరుద్యోగులు టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. కానీ ఇంతలోనే టీచర్ పోస్టుల భర్తీకి అడ్డంకులు ఉన్నాయని పేర్కొంటూ.. మరోసారి టెట్ నిర్వహణకే కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 1న టెట్ నోటిఫికేషన్ విడుదల చేయగా.. ఆగస్టు 16 వరకు అప్లై చేసే గడువు ఇచ్చారు. ఈ మేరకు సెప్టెంబర్ 15న టెట్ ఎగ్జామ్ నిర్వహించనున్నారు. అలాగే ఈ టెట్ పరీక్షా ఫలితాలను సెప్టెంబర్ 27న విడుదల చేయనున్నారు. దీంతో మరో లక్ష మందికి పైగా అభ్యర్థులు టీఆర్టీ కోసం రెడీ కానున్నారు.

కొత్తగా టెట్ నిర్వహణతో ఈ ఏడాది ఉపాధ్యాయ భర్తీల నియామకం లేనట్టేనని తేలిపోయింది. మరో రెండు నెలల్లో ఎన్నికల కోడ్ కూడా రానుండటంతో ఇప్పట్లో టీఆర్టీ నోటిఫికేషన్ లేదని అభ్యర్థులు మరింత నైరాశ్యంలో మునిగిపోయారు. అలాగే వచ్చే ఏడాది సమ్మర్‌లో పార్లమెంట్ ఎన్నికల రానున్నాయి. దీంతో వచ్చే ఏడాది చివరి వరకు ఉపాధ్యాయ నియమాకాలు ఉండవని కూడా స్పష్టం అవుతుంది.

ఇవి కూడా చదవండి

2015లో టెట్‌ పరీక్ష నిర్వహించిన ప్రభుత్వం.. 2017లో ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్‌టీ) నిర్వహించి నియామాకాలు చేపట్టింది. తర్వాత ఏడేళ్లకు, అంటే గతేడాది మళ్లీ టెట్ పరీక్ష నిర్వహించింది. మళ్లీ టెట్‌కే మొగ్గు చూపిన ప్రభుత్వం టీఆర్‌టీ నిర్వహించి ఆరేళ్లు అవుతున్నా నియమాకం చేపట్టడం లేదని అభ్యర్థులు ఆవేదన చెందుతున్నారు. మరికొన్ని నెలల్లో వరుసగా ఎన్నికల నోటిఫికేషన్‌లు రానున్న నేపథ్యంలో ఉపాధ్యాయ నియామకాల నోటిఫికేషన్‌ ఇప్పట్లో వెలువడే అవకాశం లేదని భావిస్తున్నారు. నిరుద్యోగులు మాత్రం టీఆర్‌టీ త్వరగా నిర్వహించి ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేయాలని కోరుతున్నారు.

నిమ్మరసంలో ఈ గింజలు కలిపి తాగితే షుగర్ కంట్రోల్ అవ్వాల్సిందే!
నిమ్మరసంలో ఈ గింజలు కలిపి తాగితే షుగర్ కంట్రోల్ అవ్వాల్సిందే!
టేస్టీ అండ్ హెల్దీ పన్నీర్ నగేట్స్.. ఏ టైమ్‌లో అయినా అదిరిపోతాయి
టేస్టీ అండ్ హెల్దీ పన్నీర్ నగేట్స్.. ఏ టైమ్‌లో అయినా అదిరిపోతాయి
ఏపీలో రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపునకు డేట్ ఫిక్స్.. ఎప్పటి నుంచంటే
ఏపీలో రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపునకు డేట్ ఫిక్స్.. ఎప్పటి నుంచంటే
మంచు దుప్పటి కప్పుకున్న కశ్మీరం.. రైల్వే ట్రాకులపై భారీగా మంచు
మంచు దుప్పటి కప్పుకున్న కశ్మీరం.. రైల్వే ట్రాకులపై భారీగా మంచు
నిరుద్యోగులకు బలేఛాన్స్.. DEETలో ప్రైవేటు ఉద్యోగాలు! దరఖాస్తు ఇలా
నిరుద్యోగులకు బలేఛాన్స్.. DEETలో ప్రైవేటు ఉద్యోగాలు! దరఖాస్తు ఇలా
కుంభ మేళా ఏర్పాట్లు పరిశీలించిన సీఎం యోగి.. అధికారులతో సమీక్ష
కుంభ మేళా ఏర్పాట్లు పరిశీలించిన సీఎం యోగి.. అధికారులతో సమీక్ష
చిల్డ్ బీర్ ఆర్డర్ చేస్తే.. చినిగి చాటయ్యింది..
చిల్డ్ బీర్ ఆర్డర్ చేస్తే.. చినిగి చాటయ్యింది..
ఇంట్లో హనుమంతుడు ఫోటోలు పెట్టుకోవడానికి వాస్తు నియమాలున్నాయని తెల
ఇంట్లో హనుమంతుడు ఫోటోలు పెట్టుకోవడానికి వాస్తు నియమాలున్నాయని తెల
క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో CA విద్యార్ధుల సత్తా.. 8వేల మంది ఎంపిక
క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో CA విద్యార్ధుల సత్తా.. 8వేల మంది ఎంపిక
న్యూఇయర్ వేళ గోల్డ్ లవర్స్‌కి గోల్డెన్ న్యూస్.. తగ్గిన బంగారం ధర
న్యూఇయర్ వేళ గోల్డ్ లవర్స్‌కి గోల్డెన్ న్యూస్.. తగ్గిన బంగారం ధర
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..
పేద స్నేహితుడి కుమార్తె పెళ్లికి డబ్బు సాయం.! పూర్వ విద్యార్థలు..
పేద స్నేహితుడి కుమార్తె పెళ్లికి డబ్బు సాయం.! పూర్వ విద్యార్థలు..