Rains: ఓవైపు వర్షాలు, మరోవైపు రాజకీయం.. పంట నష్టాన్ని రాజకీయాంశంగా మారుస్తున్న తెలుగు రాష్ట్రాల పార్టీలు

|

May 06, 2023 | 8:42 PM

తెలుగురాష్ట్రాల్లో కురుస్తున్న అకాల వర్షాలు రైతలను నిండా ముంచుతున్నాయి. కల్లాల్లో ఉన్న ధాన్యం తడిసిపోయింది. పొలాల్లో చేతికొచ్చిన పంట వరదపాలైంది. అటు వడగండ్ల వానతో లక్షలాది ఎకరాల్లో పంటలు నాశనమై రైతులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అకాల కష్టంలో ఉన్న అన్నదాతకు భరోసా నింపాల్సిన పార్టీలు దీనిని కూడా రాజకీయాంశంగా..

Rains: ఓవైపు వర్షాలు, మరోవైపు రాజకీయం.. పంట నష్టాన్ని రాజకీయాంశంగా మారుస్తున్న తెలుగు రాష్ట్రాల పార్టీలు
Crop Loss Due To Rains
Follow us on

తెలుగురాష్ట్రాల్లో కురుస్తున్న అకాల వర్షాలు రైతలను నిండా ముంచుతున్నాయి. కల్లాల్లో ఉన్న ధాన్యం తడిసిపోయింది. పొలాల్లో చేతికొచ్చిన పంట వరదపాలైంది. అటు వడగండ్ల వానతో లక్షలాది ఎకరాల్లో పంటలు నాశనమై రైతులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అకాల కష్టంలో ఉన్న అన్నదాతకు భరోసా నింపాల్సిన పార్టీలు దీనిని కూడా రాజకీయాంశంగా మలుచుకుంటున్నాయి. అటు ఏపీ, ఇటు తెలంగాణలోనూ ధాన్యం కొనుగోలు నుంచి పరిహారం దాకా అన్నీ రాజకీయం అయ్యాయి.

తెలుగురాష్ట్రాల్లో లక్షల హెక్టార్లలో వరి, మిర్చి, మొక్కజొన్న, ఇతర ఉద్వానవన పంటలు భారీగా దెబ్బతిన్నాయి. చేతికొచ్చిన పంట నోటిదాకా రాకపోవడంతో రైతుకంటకన్నీరే మిగిలింది. పుట్టెడు కష్టాల్లో రైతన్న ఉంటే.. ఆదుకుంటామని భరోసా ఇవ్వాల్సిన అధికార, విపక్షాలు వాటిలోనూ రాజకీయ చలి కాసుకుంటున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా రైతులు తీవ్రంగా నష్టపోయి కష్టాల్లో ఉంటే కనీస సాయం కూడా అందడం లేదంటున్నాయి విపక్షాలు. తడిసిన ధాన్యం విషయంలో ప్రభుత్వం ఇప్పటిదాకా స్పష్టత ఎందుకు ఇవ్వడం లేదంటున్నారు. ప్రభుత్వానికి సవాళ్లు విసురుతున్నాయి ప్రతిపక్షాలు. విపక్షాల విమర్శలకు స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు మంత్రులు. తడిసిన ధాన్యం కూడా కొంటామన్న మంత్రి గంగుల… కేంద్ర సాయంపై బీజేపీ ఎందుకు పెదవి విప్పడం లేదన్నారు.

ఇదిలా ఉంటే ఇటు ఏపీలోనూ అకాలవర్షంతో నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, గడిచిన నాలుగు రోజులుగా ఉభయగోదావరి జిల్లాల్లో పర్యటిస్తూ రైతులకు మద్దతు ప్రకటిస్తున్నారు. ధాన్యం కొనుగోళ్లలో బారీగా అక్రమాలు జరుగుతున్నాయంటోంది బీజేపీ. విపక్షాల విమర్శలకు ధీటుగా సమాధానం ఇస్తోంది అధికారపార్టీ. నష్టపోయిన ప్రతిరైతును ఆదుకుంటామన్న మంత్రి కాకాణి.. తడిసిన ధాన్యం కూడా కొంటున్నామన్నారు. వర్షాలు తగ్గిన తర్వాత పంట నష్టం కూడా అంచనా వేసి పరిహారం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు అటు అధికారులు ప్రకటించారు.

ఇవి కూడా చదవండి

మొత్తానికి తెలుగురాష్ట్రాల్లో ఇప్పుడు కావాల్సింది రాజకీయం కాదు… తీవ్రంగా నష్టపోయి రోడ్డమీద పడ్డ రైతన్నకు సాయంపై భరోసా.. మరి పార్టీలు ఈ దిశగా ఆలోచిస్తాయా? ప్రతిపక్షంగా రైతులకు మద్దతు ఇవ్వడం తమ బాధ్యత అంటున్నాయి. పాలకపక్షంగా ఆదుకుంటున్నాం కావాలనే రాజకీయం చేస్తున్నారని అధికారపార్టీలంటున్నాయి. మరి రైతులు ఏమంటున్నారు?

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..