మాస్టర్స్ చేసేందుకు అమెరికాకి ప్రయాణం.. చివరికి రోడ్లపై తిరుగుతూ ఆకలితో అలమటిస్తున్న తెలంగాణ యువతి

అమెరికాలో మాస్టర్స్ చేసేందుకని వెళ్లిన ఓ యువతి అష్టకష్టాలు పడుతోంది. రోడ్లపైన తిరుగుతూ ఆకలితో అలమటిస్తోంది. కూతురు గురించి తెలుసుకున్న తల్లి కేంద్ర విదేశాంగ మంత్రి జై శంకర్‌కు లేఖ రాశారు.

మాస్టర్స్ చేసేందుకు అమెరికాకి ప్రయాణం.. చివరికి రోడ్లపై తిరుగుతూ ఆకలితో అలమటిస్తున్న తెలంగాణ యువతి
Syeda Lulu Minhaj Zaidi

Updated on: Jul 26, 2023 | 5:00 PM

అమెరికాలో మాస్టర్స్ చేసేందుకని వెళ్లిన ఓ యువతి అష్టకష్టాలు పడుతోంది. రోడ్లపైన తిరుగుతూ ఆకలితో అలమటిస్తోంది. కూతురు గురించి తెలుసుకున్న తల్లి కేంద్ర విదేశాంగ మంత్రి జై శంకర్‌కు లేఖ రాశారు. వెంటనే తన కూతురుని భారత్‌కు తీసుకురావాలంటూ లేఖలో కోరింది. ఇందుకు సంబంధించిన లేఖను బీఆర్ఎస్ నేత ఖలీకర్ రెహమన్ తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఇక వివరాల్లోకి వెళ్తే హైదరబాద్‌లోని మౌలాలికి చెందిన సయ్యదా లులు మిన్జాజ్ జైదీ.. మాస్టర్స్ చేయడం కోసం 2021 ఆగస్టులో అమెరికాకు వెళ్లింది. అక్కడికి వెళ్లినప్పటి నుంచి ఆమె తన తల్లితో తరచూగా మాట్లాడుతుండేది. కానీ గత రెండు నెలలగా తన కూతురు నుంచి ఎలాంటి స్పందన రావడం లేదు.

హైదరాబాద్‌ నుంచి అమెరికా వెళ్లిన కొంతమంది లులు మిన్హాజ్‎ను గుర్తించారు. తన తల్లికి సమాచారం అందించారు. ఆమె వస్తువులు ఎవరో దొంగిలించారని.. అప్పటినుంచి చికాగో రోడ్లపై ఆకలితో అలమటిస్తోందని చెప్పారు. అలాగే లులు మిన్హాజ్ మానసిక ఒత్తిడికి కూడా లోనవుతున్నట్లు ఆమె తల్లికి వివరించారు. దీంతో తన కూతురుని తిరిగి ఇండియాకు తీసుకురావాలని తల్లి వహాజ్ ఫాతిమా కేంద్రమంత్రికి లేఖ రాశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..