Nagarkurnool: ప్రభుత్వ ఆసుపత్రి నిర్వాకం.. ఆపరేషన్‌ చేసి కడుపులో దూది మర్చిపోయారు! బాలింత మృతి

|

Aug 23, 2023 | 11:56 AM

వైద్యుల నిర్లక్ష్యం మూలంగా ఓ బాలింత నిండు ప్రాణం బలి తీసుకుంది. పురుడు పోసుకోవడానికి ఆసుపత్రికి వచ్చిన నిండు గర్భిణీకి మగబిడ్డ పుట్టింది. అనంతరం అదే ఆసుపత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ చేయగా.. కడుపులోనే దూది మర్చిపోయి వైద్యులు కుట్లు వేశారు. తీవ్ర అనారోగ్యానికి గురైన బాలింత మహిళ వారం రోజుల్లోనే మరణించింది. దీంతో ఆగ్రహించిన బంధువులు మృతురాలి శవంతో ఆసుపత్రి ఎదుట బైఠాయించి నిరసన చేపట్టారు. ఈ దారుణ ఘటన..

Nagarkurnool: ప్రభుత్వ ఆసుపత్రి నిర్వాకం.. ఆపరేషన్‌ చేసి కడుపులో దూది మర్చిపోయారు! బాలింత మృతి
Woman Died Due To Negligence Of Doctors
Follow us on

నాగర్‌కర్నూల్‌, ఆగస్టు 23: వైద్యుల నిర్లక్ష్యం మూలంగా ఓ బాలింత నిండు ప్రాణం బలి తీసుకుంది. పురుడు పోసుకోవడానికి ఆసుపత్రికి వచ్చిన నిండు గర్భిణీకి మగబిడ్డ పుట్టింది. అనంతరం అదే ఆసుపత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ చేయగా.. కడుపులోనే దూది మర్చిపోయి వైద్యులు కుట్లు వేశారు. తీవ్ర అనారోగ్యానికి గురైన బాలింత మహిళ వారం రోజుల్లోనే మరణించింది. దీంతో ఆగ్రహించిన బంధువులు మృతురాలి శవంతో ఆసుపత్రి ఎదుట బైఠాయించి నిరసన చేపట్టారు. ఈ దారుణ ఘటన నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేటలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకెళ్తే..

నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేట దర్శన్‌గడ్డ తండాకు చెందిన గిరిజన మహిళ రోజా నిండు గర్భిణి. ఆమెకు ఆగస్టు 15న పురటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి చేర్పించారు. వైద్యులు ప్రసవం చేయగా మహిళ మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రసవం జరిగిన రోజున వైద్యులు కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ చేశారు. ఆపరేషన్‌ సమయంలో వైద్యులు కడుపులో దూది మర్చిపోయి కుట్లు వేశారు. డిశ్ఛార్జి అయ్యి ఇంటికి వెళ్లిన బాధితురాలు రోజా తీవ్ర అశ్వస్థతకు గురైంది. ఆపరేషన్‌ నిర్వహించిన వారం రోజుల తర్వాత మహిళకు తీవ్ర రక్తస్రావం అయ్యింది. దీంతో మంగళవారం (ఆగస్టు 22) కుటుంబసభ్యులు ఆమెను అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆమెను ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. పరీక్షించిన ప్రైవేట్‌ వైద్యులు పరిస్థితి విషమంగా ఉందని.. వెంటనే హైదరాబాద్‌కు తీసుకు వెళ్లాలని బంధువులకు సూచించారు.

నానాకష్టం మీద హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకొచ్చి వైద్యం అందించినా ఫలితం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి బాధితురాలు రోజా మృతి చెందింది. పుట్టిన పిసకందు ఆలనాపాలనా చూసుకోకుండానే తల్లి మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. రోజా కడుపులో దూది ఉండటం మూలంగానే ఆమె మరణించినట్లు వైద్యులు తెలిపారు. దీంతో మృతదేహాన్ని బుధవారం అచ్చంపేటకు తీసుకుని వచ్చిన బంధువులు అక్కడి ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. మృతదేహంను ఆసుపత్రి ఎదుట ఉంచి బంధువులు బైఠాయించి నిరసన తెలిపారు. వైద్యులపై కఠిన చర్యలు తీసుకుని శిక్షించాలని డిమాండ్‌ చేశారు. పురిటి కోసం వస్తే ఇంతటి అగాయిత్యం చేస్తారా అంటూ కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.