Telangana: భర్తపై ఆమెకు ఎంత ప్రేమో..! పతి దేవుడికి ఏకంగా గుడి కట్టేసింది..

|

Apr 25, 2024 | 11:41 AM

ఎందరో జీవితాలను తలకిందులు చేసిన కరోనా మహమ్మారి ఆమె కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. కళ్లల్లో పెట్టుకుని చూసుకునే భర్తను ఆమె నుంచి దూరం చేసింది. కోవిడ్‌తో మూడేళ్ల క్రితం భర్త మృతి చెందడంతో ఒంటరై పోయింది. తీవ్ర మానసిక వేదనకు లోనైంది. ఈ క్రమంలో ఓ దృఢ సంకల్పాన్ని ఏర్పరచుకుంది. భర్త భౌతికంగా దూరం అయినప్పటికీ.. అతని రూపం ఎప్పటికీ తన కళ్లముందే కనిపించేలనుకుంది. అంతే ఆ ఊరిలో నిలువెత్తు విగ్రహం తయారు చేయించి.. ఏకంగా గుడి కట్టించేసింది...

Telangana: భర్తపై ఆమెకు ఎంత ప్రేమో..! పతి దేవుడికి ఏకంగా గుడి కట్టేసింది..
Wife Builds Temple For Husband
Follow us on

మహబూబాబాద్‌, ఏప్రిల్‌ 25: ఎందరో జీవితాలను తలకిందులు చేసిన కరోనా మహమ్మారి ఆమె కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. కళ్లల్లో పెట్టుకుని చూసుకునే భర్తను ఆమె నుంచి దూరం చేసింది. కోవిడ్‌తో మూడేళ్ల క్రితం భర్త మృతి చెందడంతో ఒంటరై పోయింది. తీవ్ర మానసిక వేదనకు లోనైంది. ఈ క్రమంలో ఓ దృఢ సంకల్పాన్ని ఏర్పరచుకుంది. భర్త భౌతికంగా దూరం అయినప్పటికీ.. అతని రూపం ఎప్పటికీ తన కళ్లముందే కనిపించేలనుకుంది. అంతే ఆ ఊరిలో నిలువెత్తు విగ్రహం తయారు చేయించి.. ఏకంగా గుడి కట్టించేసింది. పతియే ప్రత్యక్ష దేవంగా భావించిన నిరంతరం పూజాపురస్కారాలు కూడా నిర్వహిస్తోంది. ఈ సంఘటన మహబూబాబాద్‌ మండలం పర్వతగిరి చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..

తెలంగాణలోని మహబూబాబాద్‌ మండలం పర్వతగిరి శివారు సోమ్లాతండాకు చెందిన కల్యాణికి బానోతు హరిబాబుతో 27 ఏళ్ల క్రితం పెద్దలు కుదిర్చిన వివాహం జరిగింది. వీరికి సంతానం కలగలేదు. అయినా పొరపొచ్చాలు లేకుండా ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. భర్త హరిబాబు తన భార్యను ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. వారి దాంపత్యాన్ని చూసి విధికి కన్ను కుట్టిందేమో.. కరోనా రూపంలో భర్త ప్రాణాలను హరించింది. 2020 సెస్టెబర్‌ 9న హరిబాబు మరణించాడు. కళ్లల్లో పెట్టకుని చూసుకున్న భర్త తనను వదిలి అనంతలోకాలకు వెళ్లడంతో కళ్యాణి తల్లడిల్లి పోయింది. నాటి నుంచి భర్తనే తలచుకుంటూ ఎంతో వేధన అనుభవించింది. ఈ క్రమంలో ఆమె ఓ నిర్ణయానికి వచ్చింది. తన గ్రామంలోనే తన సొంత భూమిలో భర్తకు గుడి కట్టాలని నిర్ణయించుకుంది. సుమారు రూ.7 లక్షలతో భర్త రూపంతో పాలరాతి విగ్రహాన్ని తయారు చేయించింది. మరో 20 లక్షలతో గుడి కట్టించింది. ఇలా మొత్తం సుమారు రూ. 30 లక్షల వ్యయంతో భర్తకు గుడి కట్టించింది. బుధవారం రాజస్థాన్‌ నుంచి విగ్రహం తెప్పించి, ఆవిష్కరించింది. బంధువులు, స్థానికులతో కలిసి అర్చకుల వేదమంత్రోచ్ఛారణల మధ్య భర్త విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించింది.

గుడిలో నిత్యం పూజాది కార్యక్రమాలు నిర్వహించడంతోపాటు ప్రతీయేట భర్త జయంతి, వర్ధంతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తానని కల్యాణి తెలిపింది. చనిపోయిన భర్తకు చిరకాలం గుర్తుండి పోయేలా గుడి కట్టించిన కల్యాణిని గ్రామస్థులు అభినందిస్తున్నారు. భర్తపై ఆమెకున్న మమకారాన్ని ప్రశంసిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.