హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. బుధవారం (జూన్ 21న) తెలంగాణలోకి రుతుపవనాలు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. జూన్ 24 నాటికి రుతుపవనాలు రాష్ట్రమంతటా విస్తరిస్తాయని వెల్లడించింది. రాష్ట్రంలో రుతుపవనాలు ప్రవేశించినప్పటికీ, జూన్ 25 నుంచి స్వల్పంగా వానలు పడే అవకాశం ఉందని తెల్పింది. శనివారం నుంచి రైతులు పనులు ప్రారంభించుకోవచ్చని సూచించింది. కర్ణాటక – ఏపీ సరిహద్దుల వద్ద జూన్ 11న రుతుపవనాలు ఆగిపోయిన సంగతి తెలిసిందే. అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపర్‌జోయ్ వల్ల రుతు పవనాల్లో కదలిక ప్రారంభమైంది. సోమవారం నాటికి రాష్ట్రమంతటా రుతుపవనాలు విస్తరించనున్నాయి. మంగళ, బుధవారాల్లో తెలంగాణలోని పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలిపాటి జల్లులు పడే అవకాశం ఉంది.
కాగా జూన్ నెలాకరు సమీపిస్తున్నా తెలంగాణలో వర్షాల జాడ కానరావడం లేదు. అధిక ఉష్ణోగ్రతలతో రాష్ట్ర వాసులు నానా ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు వర్షాలు సకాలంలో కురవక పోవడంతో రైతులు పంటలు ఎలా పండించాలా అని బాధపడుతున్న సమయంలో వాతావరణ కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పింది. మంగళవారం కూడా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే రుతుపనాలు ఇప్పటికే ప్రవేశించాయి. రాయసీమ అంతటా రుతుపవనాలు విస్తరించాయి. సోమ, మంగళవారాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలుపడ్డాయి.
మరిన్ని తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.