Weather Report: అల్పపీడనం ఎఫెక్ట్.. రాబోయే 3 రోజుల వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ కీలక సూచనలు జారీ చేసింది. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల పాటు తేలిక పాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతవారణ శాఖ అంచనా వేసింది. అలాగే కొన్ని ప్రాంతాల్లో వర్షాల సమయంలో గంటకు 30-40 కిలో మీటర్ల వేగంగా ఈదురుగాలులు కూడా వీస్తాయని తెలిపింది.

తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక సూచనలు చేసింది. నైరుతి బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న తమిళనాడు తీర ప్రాంతంపై, సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్న ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని.. దీని ప్రభావంతో, రాబోయే 24 గంటల్లో అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని.. నైరుతి బంగాళాఖాతం. దానిని ఆనుకుని ఉన్న తమిళనాడు తీరం మీదుగా ఏర్పడిన పై ఉపరితల ఆవర్తనం నుండి, ద్రోణి ఇప్పుడు సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ వరకు విస్తరించి ఉందిని స్పష్టం చేసింది.
దీని ప్రభావంతో రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల పాటు వాతావరణం ఎలా ఉండబోతుందో అధికారులు అంచనా వేశారు. వాతావరణ శాఖ ప్రకారం.. రాష్ట్రంలో మంగళ, బుధవారాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని.. గురువారం మాత్రం కొన్ని జిల్లాల్లో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది.
మంగళ, బుధవారంలో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు కూడిన వర్షాలు కురువడంతో పాటు వర్షాల సమయంలో గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలుల వీచే అవకాశం ఉంది అంచనా వేసింది. ఇక గురువారం మాత్రం ఎలాంటి వర్ష సూచన లేదని కొన్ని ప్రాంతాల్లో పొడి వాతావరణం ఏర్పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
