AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: డ్రోన్‌కు వేలాడిన సైనికుడు.. గాల్లోకి లిఫ్ట్!

రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో ఉక్రెయిన్ సైన్యం అరుదైన ఆపరేషన్ నిర్వహించింది. యుద్ధభూమిలో తీవ్రంగా గాయపడి, సాధారణ మార్గాల్లో బయటకు తీసుకురావడం సాధ్యం కాని ఓ సైనికుడిని ఏకంగా గాల్లో ఎగిరే డ్రోన్‌ సాయంతో సురక్షిత ప్రాంతానికి తరలించింది. ఈ తరహా ఆపరేషన్ ప్రపంచంలోనే తొలిసారి నిర్వహించింది ఉక్రెయిన్ 92వ బ్రిగేడ్.

Video: డ్రోన్‌కు వేలాడిన సైనికుడు.. గాల్లోకి లిఫ్ట్!
For The First Time In The World Ukraine Airlifts Injured Soldier With Drone
Sharada V
|

Updated on: Oct 20, 2026 | 6:47 PM

Share

రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో ఉక్రెయిన్ సైన్యం ఓ అరుదైన ఆపరేషన్ నిర్వహించింది. యుద్ధభూమిలో తీవ్రంగా గాయపడి, సాధారణ మార్గాల్లో బయటకు తీసుకురావడం సాధ్యం కాని ఓ సైనికుడిని ఏకంగా గాల్లో ఎగిరే డ్రోన్‌ సాయంతో సురక్షిత ప్రాంతానికి తరలించింది. ఈ తరహా ఆపరేషన్ ప్రపంచంలోనే తొలిసారి నిర్వహించింది ఉక్రెయిన్ 92వ బ్రిగేడ్.

డ్రోన్‌కు వేలాడిన సైనికుడు.. గాల్లోకి లిఫ్ట్!

యుద్ధభూమిలో గాయపడిన సైనికులను రక్షించడం అత్యంత ప్రమాదకరం. శత్రు సైన్యం దాడులు జరిగే ప్రాంతాల్లోకి వెళ్లి వారిని తీసుకురావడమంటే ప్రాణాలతో చెలగాటం ఆడటమే. అలాంటి పరిస్థితుల్లో ఉక్రెయిన్ సైన్యం వినూత్న మార్గాన్ని ఎంచుకుంది. ఓ భారీ డ్రోన్‌ ను పంపింది. గాయపడిన సైనికుడు డ్రోన్‌కు అమర్చిన ప్రత్యేక విన్చ్‌ (పైకి లాగేందుకు ఉపయోగించే యాంత్రిక పరికరం)కు తనను తాను బిగించుకున్నాడు. ఆ తర్వాత డ్రోన్‌ పైకి ఎగురుతూ అతడిని కూడా గాల్లోకి తీసుకెళ్లింది. అలా ఆ సైనికుడిని ప్రమాదకర ప్రాంతం నుంచి బయటకు తీసుకువచ్చి సురక్షిత ప్రాంతానికి తరలించారు. అక్కడ అతడి సహచర సైనికులు ఎదురుచూస్తూ, చికిత్స కోసం ఆసుపత్రికి పంపించే ఏర్పాట్లు చేశారు.

ఏడాదిన్నరగా ప్రమాదకర ప్రాంతంలో..

న్‌ను తయారు చేసిన గుర్జుఫ్ డిఫెన్స్ సంస్థ కీలక విషయాలు తెలిపింది. గాయపడిన సైనికుడు ఏడాదిన్నర కాలంగా అత్యంత ప్రమాదకర యుద్ధ ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తున్నాడనీ, అతడిని సాధారణ పద్ధతుల్లో బయటకు తీసుకురావడం సాధ్యం కాదనీ తెలిపింది.  అతడిని రక్షించేందుకు సైనికులు నేరుగా అక్కడికి వెళ్లి ఉంటే, వారి ప్రాణాలకే ముప్పు ఏర్పడేదనీ ఈ పరిస్థితుల్లో అయుడాగ్-6 (Ayudag-6) అనే హెక్సాకాప్టర్ డ్రోన్‌ను ఉపయోగించి ఆ సైనికుడిని సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు తెలిపింది.  హెక్సాకాప్టర్ డ్రోన్‌ కు ఆరు రోటర్లు ఉంటాయి.

వీడియో ఇక్కడ చూడండి:

ప్రాణాపాయం తప్పింది..

ఆపరేషన్ విజయవంతమై గాయపడిన సైనికుడు చికిత్స పొందుతున్నాడు. అతడి ప్రాణాలకు ప్రమాదం లేదని ఉక్రెయిన్‌ 92వ బ్రిగేడ్ ప్రకటించింది. అయితే ఈ ఆపరేషన్ ఎక్కడ నిర్వహించారనే వివరాలను బ్రిగేడ్ బయటపెట్టలేదు. ఉక్రెయిన్ సైన్యం గతంలోనూ యుద్ధభూమి నుంచి గాయపడిన సైనికులను తరలించేందుకు మానవ రహిత వాహనాలను ఉపయోగించింది. అయితే, గాల్లో ఎగిరే డ్రోన్‌తో సైనికుడిని నేరుగా తరలించడం ఇదే తొలిసారి.

డ్రోన్లతో మారుతున్న యుద్ధతంత్రం

2022 ఫిబ్రవరిలో రష్యా ఉక్రెయిన్‌పై యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇరు దేశాలూ డ్రోన్ల వినియోగాన్ని విస్తృతంగా పెంచాయి. నిఘా, దాడులు, శత్రు స్థావరాలను గుర్తించడంలో డ్రోన్లు కీలకంగా మారాయి. యుద్ధంలో డ్రోన్లు దాడులకే పరిమితం కాలేదు. ప్రాణాలను కాపాడే సాధనాలుగానూ మారుతున్నాయి. గాయపడిన సైనికుడిని గాల్లోకి ఎత్తి సురక్షిత ప్రాంతానికి చేర్చిన ఈ ఆపరేషన్, భవిష్యత్తు యుద్ధభూమిలో వైద్య సహాయక చర్యలలో మార్పును సూచిస్తోంది.

Follow Us