AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీ వెన్నెముక 100 ఏళ్లు స్ట్రాంగ్‌గా ఉండాలా.. నిద్రపోయేటప్పుడు ఈ ఒక్క జాగ్రత్త చాలు..

ఉదయం నిద్రలేవగానే మెడ పట్టేసినట్లు ఉండటం లేదా నడుము నొప్పితో బాధపడుతున్నారా..? రోజంతా పనిచేసి అలసిపోయామని అనుకుంటాం కానీ.. అసలు సమస్య మనం పడుకునే విధానంలోనే ఉండొచ్చని మీకు తెలుసా? నిద్రపోయే భంగిమ మన వెన్నెముక ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? ఏ పొజిషన్ ఎముకలకు మేలు చేస్తుంది.. ఏది తీవ్రమైన నొప్పులకు దారితీస్తుందో తెలుసుకోండి..

మీ వెన్నెముక 100 ఏళ్లు స్ట్రాంగ్‌గా ఉండాలా.. నిద్రపోయేటప్పుడు ఈ ఒక్క జాగ్రత్త చాలు..
Best And Worst Sleeping Positions
Krishna S
| Edited By: |

Updated on: Oct 20, 2026 | 6:25 PM

Share

రోజంతా పడిన శారీరక, మానసిక శ్రమ నుంచి ఉపశమనం పొందడానికి శరీరానికి నిద్ర ఎంత ముఖ్యమో.. ఆ నిద్ర పోయే విధానం కూడా అంతే ముఖ్యం. చాలామంది ఉదయం లేవగానే తీవ్రమైన నడుము నొప్పి, మెడ పట్టేయడం లేదా భుజాల నొప్పులతో ఇబ్బంది పడుతుంటారు. దీనికి పని ఒత్తిడి మాత్రమే కారణం కాదని, మనం పడుకునే సరైన పద్ధతి తెలియకపోవడమే ప్రధాన కారణమని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మన వెన్నెముక సహజ ఆకృతిని కాపాడుతూ, ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి భంగిమల్లో నిద్రించాలో.. వేటిని నివారించాలో తెలుసుకుందాం.

వెల్లకిలా పడుకోవడం

వెల్లకిలా పడుకోవడం వల్ల శరీర బరువు మొత్తం పరుపుపై సమానంగా పంపిణీ అవుతుంది. దీనివల్ల వెన్నెముక సహజమైన సరళరేఖలో ఉంటూ శరీరంలోని కీళ్ళు, కండరాలపై ఒత్తిడి గణనీయంగా తగ్గుతుంది. వెన్నునొప్పి నివారణకు ఇది మంచి పద్ధతి అయినప్పటికీ.. గురక సమస్య, స్లీప్ అప్నియా, ఆయాసం ఉన్నవారికి ఈ భంగిమ అసౌకర్యాన్ని కలిగిస్తుంది. అలాంటి సమస్యలు ఉన్నవారు ఈ విధానానికి దూరంగా ఉండటం మంచిది.

పక్కకు తిరిగి పడుకోవడం: ఎవరికి మంచిది..?

ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ శాతం మంది పక్కకు తిరిగి పడుకోవడానికే మొగ్గు చూపుతారు. వెన్నెముక సహజ వంపులను కాపాడటంలో ఈ భంగిమ అద్భుతంగా పనిచేస్తుంది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు, అసిడిటీ, గ్యాస్ వంటి జీర్ణ సంబంధిత సమస్యలు ఉన్నవారికి ఇది ఎంతో మేలు చేస్తుంది. శరీరంలో రక్త ప్రసరణను క్రమబద్ధీకరించడానికి ఈ పద్ధతి తోడ్పడుతుంది.

చిన్న చిట్కా: పక్కకు తిరిగి పడుకున్నప్పుడు పైకాలి తొడ కిందికి జారడం వల్ల కటివలయం, వెన్నెముకపై ఒత్తిడి పడుతుంది. అందుకే రెండు మోకాళ్ల మధ్య ఒక దిండును ఉంచుకుంటే వెన్నెముక, కటి ఎముకలు ఒకే సరళరేఖలో ఉండి శరీర అమరిక దెబ్బతినకుండా ఉంటుంది.

బోర్లా పడుకుంటున్నారా? తస్మాత్ జాగ్రత్త..

నిద్ర నిపుణుల ప్రకారం అత్యంత ప్రమాదకరమైన నిద్ర భంగిమ బోర్లా పడుకోవడం. ఈ విధానంలో పడుకోవడం వల్ల మెడ ఒకవైపుకు ఎక్కువసేపు తిరిగి ఉండాల్సి వస్తుంది. ఫలితంగా మెడ ఎముకలు, వెన్నెముక యొక్క సహజ అమరిక దెబ్బతిని వాటిపై విపరీతమైన ఒత్తిడి ఏర్పడుతుంది. ఇది దీర్ఘకాలిక మెడ నొప్పి, నడుము నొప్పి, కండరాల బిగుతుకు దారితీయడమే కాకుండా అంతర్గత అవయవాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. కాబట్టి వీలైనంత వరకు బోర్లా పడుకునే అలవాటును మానుకోవాలి. సరైన నిద్ర భంగిమను ఎంచుకోవడం ద్వారా వెన్నెముక సంబంధిత సమస్యలను నివారించడంతో పాటు సంపూర్ణ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

గమనిక: ఈ కథనంలో పేర్కొన్న సమాచారం కేవలం ప్రాథమిక అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య సలహా కాదు. వెన్నెముక, నడుము నొప్పులతో తీవ్రంగా బాధపడేవారు లేదా జీవనశైలిలో మార్పులు చేసుకోవాలనుకునేవారు తప్పనిసరిగా సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించాలి.

Follow Us
మీ వెన్నెముక 100 ఏళ్లు స్ట్రాంగ్‌గా ఉండాలా.. నిద్రపోయేటప్పుడు ఈ ఒ
మీ వెన్నెముక 100 ఏళ్లు స్ట్రాంగ్‌గా ఉండాలా.. నిద్రపోయేటప్పుడు ఈ ఒ
నిషాద్ కుమార్ సంచలనం.. లాంగ్ జంప్, హైజంప్‌లో గోల్డ్ మెడల్స్!
నిషాద్ కుమార్ సంచలనం.. లాంగ్ జంప్, హైజంప్‌లో గోల్డ్ మెడల్స్!
జిగురు లేని కమ్మనైన బెండకాయ కొబ్బరి పచ్చడి..
జిగురు లేని కమ్మనైన బెండకాయ కొబ్బరి పచ్చడి..
చపాతీలోకి అదిరిపోయే చికెన్ కీమా.. ఇలా చేసేయండి!
చపాతీలోకి అదిరిపోయే చికెన్ కీమా.. ఇలా చేసేయండి!
మహిళల్లో చాక్లెట్ సిస్ట్ సమస్య అంటే ఏమిటి? దాని లక్షణాలు, కారణాలు
మహిళల్లో చాక్లెట్ సిస్ట్ సమస్య అంటే ఏమిటి? దాని లక్షణాలు, కారణాలు
మజ్జిగలో ఈ ఒక్క పదార్థం కలపండి.. బరువు తగ్గడం యమ ఈజీ
మజ్జిగలో ఈ ఒక్క పదార్థం కలపండి.. బరువు తగ్గడం యమ ఈజీ
మీ బాత్రూమ్‌లో ఇలాంటి టైల్స్ ఎంతో అవసరం! ఎందుకో తెలుసుకోండి
మీ బాత్రూమ్‌లో ఇలాంటి టైల్స్ ఎంతో అవసరం! ఎందుకో తెలుసుకోండి
రేషన్ కార్డు ఉన్నవారికి శుభవార్త.. ఇకపై నిత్యావసర సరుకులు
రేషన్ కార్డు ఉన్నవారికి శుభవార్త.. ఇకపై నిత్యావసర సరుకులు
దసరా రోజు పాలపిట్ట కనిపించలేదా? బాధపడకండి.. ఇలా చేయండి!
దసరా రోజు పాలపిట్ట కనిపించలేదా? బాధపడకండి.. ఇలా చేయండి!
బుమ్రాను ఆడించొద్దు.. మాజీ కోచ్ రవి శాస్త్రి సంచలన కామెంట్స్..!
బుమ్రాను ఆడించొద్దు.. మాజీ కోచ్ రవి శాస్త్రి సంచలన కామెంట్స్..!