AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మహిళల్లో చాక్లెట్ సిస్ట్ సమస్య అంటే ఏమిటి? దాని లక్షణాలు, కారణాలు, చికిత్స విధానాలు ఇవే!

మహిళల్లో అండాశయంలో ఏర్పడే చాక్లేట్ సిస్ట్ అనేది ఒక తీవ్రమైన ఆరోగ్య సమస్య. వైద్య పరిభాషలో దీనిని ఓవేరియన్ ఎండోమెట్రియోమాస్ అని పిలుస్తారు. దీనివల్ల రుతుక్రమ సమయంలో తీవ్రమైన కడుపునొప్పి, అసౌకర్యం, గర్భధారణలో సమస్యలు తలెత్తుతాయి. సరైన సమయంలో వైద్యులను సంప్రదించి చికిత్స పొందడం ద్వారా ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

మహిళల్లో చాక్లెట్ సిస్ట్ సమస్య అంటే ఏమిటి? దాని లక్షణాలు, కారణాలు, చికిత్స విధానాలు ఇవే!
Chocolate Cysts In Women
Jyothi Gadda
| Edited By: |

Updated on: Oct 20, 2026 | 6:15 PM

Share

మహిళల్లో అండాశయం లో వచ్చే సమస్యలలో చాక్లెట్ సిస్ట్ చాలా ముఖ్యమైనది. తీవ్రమైనది. పేరుకు చాక్లెట్ అని ఉన్నప్పటికీ, దీనికి చాక్లెట్లు తినడానికి ఎలాంటి సంబంధం లేదు. వైద్య భాషలో దీనిని ఓవేరియన్ ఎండోమెట్రియోమాస్ అని పిలుస్తారు. ఇది ఎండోమెట్రియోసిస్ అనే వ్యాధితో ముడిపడి ఉండే ఒక రకమైన గడ్డ లేదా నీటి బుడగ వంటి అమరిక.

చాక్లెట్ సిస్ట్ అంటే ఏమిటి? ఎందుకు వస్తుంది?

సాధారణంగా గర్భాశయం లోపలి పొరను ఎండోమెట్రియం అని పిలుస్తారు. కొన్ని కారణాల వల్ల ఈ పొర కణాలు గర్భాశయం వెలుపల, ముఖ్యంగా అండాశయాల పై పెరగడం ప్రారంభిస్తాయి. ప్రతి నెలా రుతుక్రమం వచ్చినప్పుడు ఈ కణాలు కూడా స్పందించి రక్తాన్ని స్రవిస్తాయి. అయితే, ఈ రక్తం బయటకు వెళ్లే మార్గం లేకపోవడంతో అండాశయంలోనే పేరుకుపోతుంది. కాలక్రమేణా ఆ పాత రక్తం చిక్కబడి, ముదురు గోధుమ లేదా కరిగిన చాక్లెట్ రంగులోకి మారుతుంది. అందుకే దీనికి చాక్లెట్ సిస్ట్ అని పేరు వచ్చింది.

ముఖ్యమైన లక్షణాలు:

తీవ్రమైన రుతుక్రమ నొప్పి: పీరియడ్స్ సమయంలో తట్టుకోలేని నడుము, కడుపునొప్పి రావడం.

ఇవి కూడా చదవండి

సంభోగం సమయంలో నొప్పి: శారీరక కలయిక సమయంలో తీవ్రమైన అసౌకర్యం లేదా నొప్పి అనిపించడం.

సంతానలేమి: గర్భం దాల్చడంలో తీవ్రమైన అడ్డంకులు, ఇబ్బందులు ఎదురుకావడం.

క్రమం లేని పీరియడ్స్: రుతుక్రమం సరిగా రాకపోవడం లేదా అధిక రక్తస్రావం కావడం.

గర్భధారణపై ప్రభావం, చికిత్స విధానాలు:

చాక్లెట్ సిస్ట్ వల్ల అండాశయంలో అండాల విడుదల లోపించి, గర్భం దాల్చడం కష్టమవుతుంది. కానీ, సరైన సమయంలో గుర్తిస్తే దీనికి మంచి చికిత్స అందుబాటులో ఉంది.

మందుల చికిత్స: సిస్ట్ పరిమాణం చిన్నదిగా ఉంటే, హోర్మోనల్ మందులు, పెయిన్ కిల్లర్స్ ద్వారా నొప్పిని, సిస్ట్ ఎదుగుదలను అదుపు చేస్తారు.

ల్యాపరోస్కోపీ సర్జరీ: సిస్ట్ పరిమాణం పెద్దదిగా ఉన్నప్పుడు లేదా తీవ్రమైన నొప్పి, సంతానలేమి సమస్యలు ఉన్నప్పుడు ల్యాపరోస్కోపిక్ సర్జరీ ద్వారా సిస్ట్‌ను తొలగిస్తారు. మహిళలు పీరియడ్స్ సమయంలో వచ్చే తీవ్రమైన నొప్పిని సాధారణమైనదిగా భావించి నిర్లక్ష్యం చేయకుండా, వెంటనే గైనకాలజిస్ట్‌ను సంప్రదించి పరీక్షలు చేయించుకోవడం ఎంతో అవసరం.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
మహిళల్లో చాక్లెట్ సిస్ట్ సమస్య అంటే ఏమిటి? దాని లక్షణాలు, కారణాలు
మహిళల్లో చాక్లెట్ సిస్ట్ సమస్య అంటే ఏమిటి? దాని లక్షణాలు, కారణాలు
మజ్జిగలో ఈ ఒక్క పదార్థం కలపండి.. బరువు తగ్గడం యమ ఈజీ
మజ్జిగలో ఈ ఒక్క పదార్థం కలపండి.. బరువు తగ్గడం యమ ఈజీ
మీ బాత్రూమ్‌లో ఇలాంటి టైల్స్ ఎంతో అవసరం! ఎందుకో తెలుసుకోండి
మీ బాత్రూమ్‌లో ఇలాంటి టైల్స్ ఎంతో అవసరం! ఎందుకో తెలుసుకోండి
రేషన్ కార్డు ఉన్నవారికి శుభవార్త.. ఇకపై నిత్యావసర సరుకులు
రేషన్ కార్డు ఉన్నవారికి శుభవార్త.. ఇకపై నిత్యావసర సరుకులు
దసరా రోజు పాలపిట్ట కనిపించలేదా? బాధపడకండి.. ఇలా చేయండి!
దసరా రోజు పాలపిట్ట కనిపించలేదా? బాధపడకండి.. ఇలా చేయండి!
బుమ్రాను ఆడించొద్దు.. మాజీ కోచ్ రవి శాస్త్రి సంచలన కామెంట్స్..!
బుమ్రాను ఆడించొద్దు.. మాజీ కోచ్ రవి శాస్త్రి సంచలన కామెంట్స్..!
ఊరిలో తల లేని శవం.. ఓటీటీలో మరో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
ఊరిలో తల లేని శవం.. ఓటీటీలో మరో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
మరణం గురించి మాట్లాడిన ఫాదర్‌.. భారీ శిలువ కూలి మృతి!
మరణం గురించి మాట్లాడిన ఫాదర్‌.. భారీ శిలువ కూలి మృతి!
ISRO శ్రీహరికోటలో 97 ఉద్యోగాలు.. రూ.1.42 లక్షల వరకు జీతం..
ISRO శ్రీహరికోటలో 97 ఉద్యోగాలు.. రూ.1.42 లక్షల వరకు జీతం..
దసరా నాడు పాలపిట్ట దర్శనం ఎందుకు చేసుకోవాలో తెలుసా?
దసరా నాడు పాలపిట్ట దర్శనం ఎందుకు చేసుకోవాలో తెలుసా?