AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వీడికేం పోయే కాలం.. రోడ్డు డివైడర్‌పై స్కూటర్ రేసింగ్! నెటిజన్ల రియాక్షన్‌ చూడాలి..

సడన్‌గా రోడ్డు డివైడర్‌పైనే స్కూటర్ నడుపుతున్న ఒక వ్యక్తి వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. రహదారిపై వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించేందుకు డివైడర్లను ఉపయోగిస్తారు.. కానీ ఈ సదరు వాహనదారుడు మాత్రం డివైడర్ ఇరుకైన భాగంపైననే తన స్కూటర్‌ను సునాయాసంగా నడుపుతూ ముందుకు వెళ్లాడు. ఈ ప్రమాదకరమైన విన్యాసాన్ని చూసిన నెటిజన్లు తీవ్ర స్థాయిలో స్పందించారు. కొందరు సరదాగా కామెంట్లు చేస్తున్నారు. అయితే, కొద్దిపాటి అసమతుల్యత తలెత్తినా తీవ్రమైన ప్రమాదం జరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇంతకీ వైరల్‌ వీడియోలో ఏముందంటే..

వీడికేం పోయే కాలం.. రోడ్డు డివైడర్‌పై స్కూటర్ రేసింగ్! నెటిజన్ల రియాక్షన్‌ చూడాలి..
Scooter Stunt
Jyothi Gadda
|

Updated on: Oct 17, 2026 | 9:28 PM

Share

సోషల్ మీడియా ప్రపంచంలో రోజూ ఎన్నో విచిత్రమైన, ఆశ్చర్యపరిచే వీడియోలు ప్రత్యక్షమవుతుంటాయి. వాటిలో కొన్ని నవ్వు తెప్పిస్తే, మరికొన్ని మాత్రం తీవ్రమైన ఆందోళనను కలిగిస్తాయి. తాజాగా అలాంటి ఒక వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. సాధారణంగా రోడ్డు మధ్యలో వాహనాలు ఎదురెదురుగా రాకుండా ఉండటానికి, ట్రాఫిక్‌ను నియంత్రించడానికి వేసే డివైడర్‌పై ఓ వ్యక్తి ఏకంగా తన స్కూటర్‌ను నడుపుతూ కనిపించాడు. ఇంతకీ ఏం జరిగింది?

వైరల్ అవుతున్న ఈ వీడియో క్లిప్‌లో ఒక స్కూటర్‌పై వెళ్తున్న వ్యక్తి రోడ్డుపై ప్రయాణించడానికి బదులుగా, రోడ్డు మధ్యలో ఉన్న ఎత్తైన, ఇరుకైన డివైడర్ పైకి తన వాహనాన్ని ఎక్కించాడు. అంతేకాకుండా ఎలాంటి భయం లేకుండా కొంత దూరం వరకు ఆ ఇరుకైన డివైడర్‌పైనే బ్యాలెన్స్ చేసుకుంటూ స్కూటర్‌ను వేగంగా నడిపాడు. చుట్టూ రోడ్డుపై ఇతర వాహనాలు ప్రయాణిస్తున్నప్పటికీ, అతడు మాత్రం డివైడర్‌నే తన ప్రత్యేక ట్రాక్‌లా భావించి వాహనాన్ని నడపడం గమనార్హం.

ఇవి కూడా చదవండి

నెటిజన్ల విచిత్ర స్పందన – జీటీఏ గేమ్‌తో పోలిక:

ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ కాగానే వేలాదిమంది వ్యూస్, కామెంట్లతో వైరల్‌గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు విపరీతంగా స్పందిస్తున్నారు. ప్రముఖ వీడియో గేమ్ గ్రాండ్ థెఫ్ట్ ఆటో (GTA) లో ఆటగాళ్లు కార్లు, బైక్‌లను రోడ్లపై కాకుండా విచిత్రమైన ప్రదేశాల్లో, భవనాలపై నడుపుతుంటారు. ఈ సీన్‌ను చూసిన చాలామంది వీడేంట్రా బాబు… నిజ జీవితంలో జీటీఏ గేమ్ ఆడుతున్నాడు అని కామెంట్లు పెడుతున్నారు. మరికొందరైతే ఆ వ్యక్తి అద్భుతమైన బ్యాలెన్సింగ్‌ను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ప్రమాదకరమైన స్టంట్లు వద్దు:

వీడియో గేమ్‌లలో ఇలాంటి స్టంట్లు చూడటానికి సరదాగా అనిపించినప్పటికీ, నిజ జీవితంలో రోడ్లపై ఇలాంటి పనులు చేయడం అత్యంత ప్రమాదకరమని ట్రాఫిక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొద్దిపాటి శ్రద్ధ తగ్గినా లేదా బ్యాలెన్స్ తప్పినా డివైడర్ పైనుంచి కింద పడి పక్కన వెళ్లే వాహనాల కింద పడే ప్రమాదం ఉంది. ఇది సదరు వాహనదారుడికే కాకుండా రోడ్డుపై వెళ్లే ఇతర ప్రయాణికులకు కూడా తీవ్ర ప్రాణాపాయం కలిగిస్తుంది. కాబట్టి సోషల్ మీడియా పబ్లిసిటీ కోసం లేదా రీల్స్ కోసం ఇలాంటి ప్రాణాంతకమైన స్టంట్లు చేయవద్దని పోలీసులు సూచిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us