AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒకే ఏషియన్ పారా గేమ్స్‌లో రెండు స్వర్ణాలు.. చరిత్ర సృష్టించిన నిషాద్ కుమార్!

Indian Player Nishad Kumar Creates History: భారత పారా అథ్లెట్ నిషాద్ కుమార్ (Nishad Kumar) ఏషియన్ పారా గేమ్స్ 2026లో అద్భుత చరిత్ర సృష్టించారు. వరుసగా రెండు రోజుల్లో రెండు స్వర్ణ పతకాలు సాధించి భారత పతాకాన్ని రెపరెపలాడించారు.

ఒకే ఏషియన్ పారా గేమ్స్‌లో రెండు స్వర్ణాలు.. చరిత్ర సృష్టించిన నిషాద్ కుమార్!
Nishad Kumar Creates History
Venkata Chari
|

Updated on: Oct 20, 2026 | 6:24 PM

Share

Nishad Kumar Creates History: భారత పారా అథ్లెటిక్స్‌లో నిషాద్ కుమార్ మరో అద్భుత ఘనత సాధించారు. జపాన్‌లో జరుగుతున్న ఏషియన్ పారా గేమ్స్ 2026లో వరుసగా రెండు రోజుల్లో రెండు స్వర్ణ పతకాలు గెలిచి చరిత్ర సృష్టించారు. హైజంప్‌లో తనకున్న ప్రత్యేకతను మరోసారి చాటుకున్న నిషాద్, పురుషుల T47 హైజంప్ విభాగంలో 2.04 మీటర్ల ఎత్తును అధిగమించి గోల్డ్ మెడల్ సాధించారు. ఈ ప్రదర్శనతో గేమ్స్ రికార్డును కూడా నెలకొల్పారు.

నిషాద్‌కు ఇది ఈ ఏషియన్ పారా గేమ్స్‌లో రెండో స్వర్ణ పతకం. అంతకుముందు సోమవారం జరిగిన T47 లాంగ్ జంప్ ఫైనల్లో 7.11 మీటర్ల దూరం దూకి బంగారు పతకం అందుకున్నారు. అంతర్జాతీయ స్థాయిలో లాంగ్ జంప్‌లో ఇదే ఆయన తొలి ప్రధాన పోటీ కావడం విశేషం. తొలి ప్రయత్నంలో 6.95 మీటర్లు దూకిన నిషాద్, రెండో ప్రయత్నంలో 7.09 మీటర్లకు మెరుగుపడ్డారు. మూడో ప్రయత్నంలో 7.11 మీటర్లతో అగ్రస్థానాన్ని ఖరారు చేసుకున్నారు.

లాంగ్ జంప్‌లో ఉజ్బెకిస్థాన్‌కు చెందిన ఒమాద్బెక్ ఖసనోవ్ 6.99 మీటర్లతో రజత పతకం సాధించగా, శ్రీలంకకు చెందిన మొహమ్మదు సఫ్రాన్ 6.55 మీటర్లతో కాంస్యం గెలిచారు.

హైజంప్‌లో 2.04 మీటర్ల ప్రదర్శనతో నిషాద్ మరోసారి తన సత్తా చాటారు. దీంతో ఒకే ఎడిషన్‌లో రెండు స్వర్ణాలు సాధించిన భారత అథ్లెట్లలో నిషాద్‌కు ప్రత్యేక స్థానం దక్కింది.

నిషాద్ చిన్న వయసులోనే ఒక ప్రమాదంలో తన కుడి చేతిని కోల్పోయారు. ఆ కష్టాన్ని అధిగమించి పారా అథ్లెటిక్స్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. టోక్యో 2020, పారిస్ 2024 పారాలింపిక్స్‌లో హైజంప్‌లో రజత పతకాలు సాధించిన ఆయన, ఇప్పుడు ఏషియన్ పారా గేమ్స్‌లో రెండు స్వర్ణాలతో తన విజయాల జాబితాను మరింత గొప్పగా మార్చుకున్నారు.

నిషాద్ ప్రదర్శనపై ప్రధాని నరేంద్ర మోదీ కూడా ప్రశంసలు కురిపించారు. లాంగ్ జంప్‌లో అరంగేట్రంలోనే స్వర్ణం సాధించడం ఆయన ప్రతిభ, పట్టుదలకు నిదర్శనమని ప్రశంసించారు.

Follow Us
నిషాద్ కుమార్ సంచలనం.. లాంగ్ జంప్, హైజంప్‌లో గోల్డ్ మెడల్స్!
నిషాద్ కుమార్ సంచలనం.. లాంగ్ జంప్, హైజంప్‌లో గోల్డ్ మెడల్స్!
జిగురు లేని కమ్మనైన బెండకాయ కొబ్బరి పచ్చడి..
జిగురు లేని కమ్మనైన బెండకాయ కొబ్బరి పచ్చడి..
చపాతీలోకి అదిరిపోయే చికెన్ కీమా.. ఇలా చేసేయండి!
చపాతీలోకి అదిరిపోయే చికెన్ కీమా.. ఇలా చేసేయండి!
మహిళల్లో చాక్లెట్ సిస్ట్ సమస్య అంటే ఏమిటి? దాని లక్షణాలు, కారణాలు
మహిళల్లో చాక్లెట్ సిస్ట్ సమస్య అంటే ఏమిటి? దాని లక్షణాలు, కారణాలు
మజ్జిగలో ఈ ఒక్క పదార్థం కలపండి.. బరువు తగ్గడం యమ ఈజీ
మజ్జిగలో ఈ ఒక్క పదార్థం కలపండి.. బరువు తగ్గడం యమ ఈజీ
మీ బాత్రూమ్‌లో ఇలాంటి టైల్స్ ఎంతో అవసరం! ఎందుకో తెలుసుకోండి
మీ బాత్రూమ్‌లో ఇలాంటి టైల్స్ ఎంతో అవసరం! ఎందుకో తెలుసుకోండి
రేషన్ కార్డు ఉన్నవారికి శుభవార్త.. ఇకపై నిత్యావసర సరుకులు
రేషన్ కార్డు ఉన్నవారికి శుభవార్త.. ఇకపై నిత్యావసర సరుకులు
దసరా రోజు పాలపిట్ట కనిపించలేదా? బాధపడకండి.. ఇలా చేయండి!
దసరా రోజు పాలపిట్ట కనిపించలేదా? బాధపడకండి.. ఇలా చేయండి!
బుమ్రాను ఆడించొద్దు.. మాజీ కోచ్ రవి శాస్త్రి సంచలన కామెంట్స్..!
బుమ్రాను ఆడించొద్దు.. మాజీ కోచ్ రవి శాస్త్రి సంచలన కామెంట్స్..!
ఊరిలో తల లేని శవం.. ఓటీటీలో మరో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
ఊరిలో తల లేని శవం.. ఓటీటీలో మరో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్