AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాత్రి మిగిలిన అన్నం పడేయకుండా.. ఇలా దూదిలాంటి ఇడ్లీలు చేయండి

ప్రతి ఇంట్లోనూ రాత్రి వేళ అన్నం కాస్తో కూస్తో మిగిలిపోవడం సర్వసాధారణం. అలా మిగిలిపోయిన అన్నాన్ని చాలామంది పడేస్తుంటారు లేదా చద్ది అన్నంలా తింటుంటారు. అయితే మినప్పప్పు నానబెట్టి, పిండి రుబ్బి రాత్రంతా పులియబెట్టే సమయం లేనప్పుడు.. ఈ మిగిలిన అన్నంతోనే మల్లెపూవులా మెత్తగా, దూదిలాంటి స్పాంజ్ ఇడ్లీలను చిటికెలో సిద్ధం చేసుకోవచ్చు. ఈ రెసిపీలో అత్యంత ముఖ్యమైన సూత్రం సరైన కొలతలు మరియు పుల్లటి మజ్జిగను వాడటం.

Phani CH
|

Updated on: Oct 20, 2026 | 6:37 PM

Share
కావలసిన పదార్థాలు: 2 కప్పుల ఇడ్లీ రవ్వ, 1 కప్పు నిండుగా  చేత్తో అదిమి పైకి వచ్చేలా కొలిచిన మిగిలిన అన్నం, 1½ కప్పుల పుల్లటి మజ్జిగ ,  రుచికి సరిపడా ఉప్పు, పావు టీస్పూన్ వంట సోడా, ఇడ్లీ ప్లేట్లకు పూయడానికి కొద్దిగా నెయ్యి లేదా నూనె , రవ్వ నానబెట్టడానికి & పిండి కలుపుకోవడానికి తగినన్ని నీళ్లు

1 / 5
తయారీ విధానం: ఒక గిన్నెలో 2 కప్పుల ఇడ్లీ రవ్వను తీసుకోవాలి. ఇందులో నీళ్లు పోసి చేత్తో రుద్దుతూ రెండు సార్లు శుభ్రంగా కడగాలి. కడిగిన నీటిని వంపేసి.. తిరిగి మంచి నీళ్లు పోసి కనీసం 1 గంట పాటు నానబెట్టుకోవాలి. ఇన్స్టంట్ ఇడ్లీలు కాబట్టి రవ్వ గంట పాటు నానితేనే మెత్తగా వస్తాయి.మిక్సీ జార్‌లో 1 కప్పు నిండుగా ఉన్న మిగిలిన అన్నాన్ని వేయాలి. ఇందులో ఒకటిన్నర కప్పుల పుల్లటి మజ్జిగ పోయాలి. బరక ఏమాత్రం లేకుండా చాలా నునుపైన మెత్తటి పేస్ట్‌లా మిక్సీ పట్టుకోవాలి. అవసరమైతే కొద్దిగా నీళ్లు చిలకరించుకోవచ్చు.

2 / 5
గంట తర్వాత నానిన ఇడ్లీ రవ్వలోని నీటిని వంపేసి.. రెండు చేతుల మధ్య రవ్వను ఉంచి నీరు ఏమాత్రం లేకుండా గట్టిగా పిండి, మిక్సీ పట్టిన అన్నం మిశ్రమంలో వేయాలి. రవ్వ మరియు అన్నం పేస్ట్ సమంగా కలిసేలా చేత్తో బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు, పావు టీస్పూన్ వంటసోడా వేయాలి. ఇన్స్టంట్ ఇడ్లీ కాబట్టి పిండిని చేతితో కాసేపు ఎక్కువ సమయం గాలి బుడగలు వచ్చేలా బాగా బీట్ చేస్తూ కలపాలి. పిండి గట్టిగా అనిపిస్తే కొద్దిగా నీళ్లు చిలకరించి ఇడ్లీ పిండి జారుడు కన్సిస్టెన్సీకి తెచ్చుకోవాలి.

3 / 5
ఇడ్లీ ప్లేట్లకు కొద్దిగా నెయ్యి లేదా నూనె రాయాలి. గరిటెతో పిండిని ఇడ్లీ గుంటల్లో నింపుకోవాలి. ఇడ్లీ పాత్రలో నీళ్లు పోసి వేడిచేసి, ఇడ్లీ స్టాండ్‌ను లోపల ఉంచి మూతపెట్టాలి. మొదట లో ఫ్లేమ్‌లో ఒక నిమిషం పాటు ఉంచి.. ఆ తర్వాత మీడియం-హై ఫ్లేమ్‌లో 8 నుండి 10 నిమిషాలు ఆవిరిపై ఉడికించాలి.

4 / 5
స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వెంటనే మూత తీయకుండా 2 నిమిషాలు అలాగే వదిలేయాలి. ఆ తర్వాత మూత తీసి చల్లటి నీళ్ల తడి చేసుకున్న స్పూన్‌తో ఇడ్లీలను ప్లేట్‌లోకి తీసుకోవాలి.అంతే, నోరూరించే దూదిలాంటి 'ఇన్స్టంట్ ఇడ్లీలు' సిద్ధం! కమ్మని పల్లీ చట్నీ, అల్లం చట్నీ లేదా సాంబార్‌తో వేడివేడిగా తింటుంటే రాత్రి మిగిలిన అన్నంతో చేశారంటే ఎవరూ నమ్మలేనంత సాఫ్ట్‌గా, రుచిగా ఉంటాయి!

5 / 5
Follow Us
రాత్రి మిగిలిన అన్నం పడేయకుండా.. ఇలా దూదిలాంటి ఇడ్లీలు చేయండి
రాత్రి మిగిలిన అన్నం పడేయకుండా.. ఇలా దూదిలాంటి ఇడ్లీలు చేయండి
అత్యాశ మనల్ని తప్పుడు మార్గంలో నడిపిస్తుంది.. తిండిబోతు ఎలుక కథ

టమాటాలను బయట ఉంచాలా.. ఫ్రిజ్‌లో పెట్టాలా? సరైన పద్ధతి ఇదే!

నేచురల్ కదా అని తేనెను అతిగా తినకండి.. ఈ సమస్యలు రావచ్చు!

మీ వెన్నెముక 100 ఏళ్లు స్ట్రాంగ్‌గా ఉండాలా.. నిద్రపోయేటప్పుడు ఈ ఒ

నిషాద్ కుమార్ సంచలనం.. లాంగ్ జంప్, హైజంప్‌లో గోల్డ్ మెడల్స్!

జిగురు లేని కమ్మనైన బెండకాయ కొబ్బరి పచ్చడి..

చపాతీలోకి అదిరిపోయే చికెన్ కీమా.. ఇలా చేసేయండి!

మహిళల్లో చాక్లెట్ సిస్ట్ సమస్య అంటే ఏమిటి? దాని లక్షణాలు, కారణాలు

మజ్జిగలో ఈ ఒక్క పదార్థం కలపండి.. బరువు తగ్గడం యమ ఈజీ