Telangana Weather Report: హైదరాబాద్‌లో ఒక్కసారిగా మారిన వాతావరణం.. పలు చోట్ల కురిసిన వర్షం..

|

Mar 19, 2022 | 5:42 PM

Hyderabad Weather Report: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. నగర వ్యాప్తంగా నల్లని మేఘాలు దట్టంగా కమ్ముకున్నాయి.

Telangana Weather Report: హైదరాబాద్‌లో ఒక్కసారిగా మారిన వాతావరణం.. పలు చోట్ల కురిసిన వర్షం..
Hyderabad
Follow us on

Hyderabad Weather Report: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. నగర వ్యాప్తంగా నల్లని మేఘాలు దట్టంగా కమ్ముకున్నాయి. కొన్ని చోట్ల చిరు జల్లులు కురుస్తున్నాయి. గత కొన్నిరోజులు హైదరాబాద్‌లో ఎండలు దంచికొడుతున్నాయి. బయటకొస్తే చాలు.. భానుడి భగభగలతో జనం ఉక్కిరి బిక్కిరి అయ్యారు. భారీగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలకు ఆందోళనకు గురయ్యారు. ఇప్పుడే ఇలా ఉంటే.. ఏప్రిల్, మే నెలల్లో ఎండలు ఏ రేంజ్‌లో ఉంటాయోనని హడలిపోతున్నారు. ఇలాంటి తరుణంలో నగర వ్యాప్తంగా ఒక్కసారిగా వాతావరణం మారిపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. వాతావరణం మొత్తం కూల్‌గా మారిపోయింది. ఆకాశం దట్టమైన మేఘాలతో కమ్ముకోవడంతో.. అప్పుడే చీకటి పడినట్లుగా అనిపిస్తోంది. అయితే, కొన్నిచోట్ల చిరు జల్లులు కురుస్తున్నాయి. కాలాపత్తర్, జూపార్క్, ఫలక్‌నూమా, బహదూర్‌పురా, పాతబస్తీ, దుండిగల్, సూరారం, జీడిమెట్ల, దూలపల్లి, బహదూర్‌పల్లిలో వర్షం కురిసింది. వికారాబాద్ జిల్లాలోని ప‌లు ప్రాంతాల్లోనూ వాన‌లు ప‌డ్డాయి. మరికొన్ని ప్రాంతాలలో ఆకాశం మేఘావృతం అయ్యింది. వాతావరణం ఒక్కసారిగా కూల్ అవడంతో ప్రజలకు ఉక్కపోత నుంచి ఉపశమనం లభించినట్లయ్యింది.

Also read:

Japan PM Tour: జపాన్ ప్రధాని ఫుమియో కిషిడాకు భారత్‌‌లో ఘనస్వాగతం.. ప్రధాని మోడీతో కీలక ద్వైపాక్షిక చర్చలు

Viral Video: చెల్లెలు సైకిల్ తొక్కడానికి అక్క సాయం.. వీరి ప్రేమని మిస్ కాకండి.. వైరల్ వీడియో

Yamini Bhaskar: య‌మ్మీ య‌మ్మీ స్టిల్స్ తో రభస బ్యూటీ.. యామిని భాస్కర్ లేటెస్ట్ ఫోటోస్ వైరల్