Telangana Rains: తెలంగాణ వాసులకు అలర్ట్.. మరో మూడు రోజులు వర్షాలే వర్షాలు..

Telangana Rains: తెలంగాణకు మరో వాన ముప్పు పొంచి ఉంది. తాజాగా హైదరాబాద్ వాతావరణ శాఖ రాష్ట్ర వెదర్ రిపోర్ట్ వెల్లడించింది.

Telangana Rains: తెలంగాణ వాసులకు అలర్ట్.. మరో మూడు రోజులు వర్షాలే వర్షాలు..
Heavy Rains

Edited By:

Updated on: Jul 18, 2022 | 8:41 PM

Telangana Rains: తెలంగాణకు మరో వాన ముప్పు పొంచి ఉంది. తాజాగా హైదరాబాద్ వాతావరణ శాఖ రాష్ట్ర వెదర్ రిపోర్ట్ వెల్లడించింది. రాగల మూడు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. దీని ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. నిన్న తూర్పు విదర్భ, పరిసర ప్రాంతంలో ఉన్న అల్పపీడనం ఈ రోజు తూర్పు విదర్భ, పరిసర ప్రాంతంలో కొనసాగుతూ ఉంది. ఈ అల్పపీడనంకి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుండి 7.6 కి.మీ వరకు విస్తరించి ఎత్తుకి వెళ్లే కొద్ది నైరుతిదిశ వైపుగా వంపు తిరిగి ఉంది.

దీని ప్రభావంతో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి తేలికపాటి నుండి మోస్తరు వర్షములు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. అలాగే, రేపు, ఎల్లుండి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు, మరికొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..