AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telugu Water War: మళ్ళీ మొదలైన తెలుగు రాష్ట్రాల మధ్య జలజగడం.. ఏపీ ప్రభుత్వంపై KRMBకి తెలంగాణ కంప్లైంట్‌

రాష్ట్రం విభజన జరిగి ఏళ్లకు ఏళ్ళు జరిగినా జలజగడం కొనసాగుతూనే ఉంది. తెలుగు రాష్ట్రాల మధ్య మరోసారి వాటర్‌ ఫైట్‌ మొదలైంది. వారం రోజుల గ్యాప్‌లోనే ఏపీపై సెకండ్‌ టైమ్‌ కంప్లైంట్ చేసింది తెలంగాణ. ఆర్డీఎస్‌ రైట్‌ కెనాల్‌ టార్గెట్‌గా లేఖ సంధించింది.

Telugu Water War: మళ్ళీ మొదలైన తెలుగు రాష్ట్రాల మధ్య జలజగడం.. ఏపీ ప్రభుత్వంపై KRMBకి తెలంగాణ కంప్లైంట్‌
Ap And Ts Water Disputes
Surya Kala
|

Updated on: Jul 13, 2022 | 8:01 AM

Share

Water War Between AP and TS: ఏపీ (Andhra Pradesh), తెలంగాణ(Telangana) మధ్య మరోసారి జల జగడం రాజుకుంటోంది. ఏపీ ప్రభుత్వంపై కంప్లైంట్స్‌ మీద కంప్లైంట్స్ చేస్తోంది తెలంగాణ సర్కార్‌. వారం రోజులు తిరగకముందే KRMBకి రెండోసారి కంప్లైంట్‌ చేసింది తెలంగాణ. ఎప్పటిలాగే కృష్ణా జలాలపైనే కంప్లైంట్‌ చేసింది తెలంగాణ. సరిగ్గా వారంరోజుల క్రితం KRMBకి రెండు లేఖలు రాసిన తెలంగాణ సర్కార్‌, ప్రకాశం బ్యారేజీ దిగువన నిర్మించతలపెట్టిన రెండు ఆనకట్టలపైన, పంప్డ్‌ స్టోరేజీ స్కీమ్స్‌పైనా ఫిర్యాదు చేసింది. లేటెస్ట్‌గా ఆర్డీఎస్‌ రైట్‌ కెనాల్‌ వర్క్స్‌పై అభ్యంతరం తెలిపింది తెలంగాణ. ఆర్డీఎస్‌ కుడి కాలువ పనులు కొనసాగించకుండా ఏపీని అడ్డుకోవాలంటూ KRMBకి లేఖ రాసింది. ఎలాంటి అనుమతులు లేకుండా రాజోలిబండ డైవర్షన్‌ స్కీమ్‌ రైట్‌ కెనాల్‌ పనులను ఆంధ్రప్రదేశ్‌ చేస్తోందని ఆరోపిస్తోంది తెలంగాణ.

KRMB ఆదేశాలకు విరుద్ధంగా పనులు జరుగుతున్నాయని కృష్ణానది యాజమాన్య బోర్డు దృష్టికి తీసుకెళ్లింది. ఆర్డీఎస్‌ రైట్‌ కెనాల్‌ వర్క్స్‌పై గతంలోనే కంప్లైంట్‌ చేయడంతో కొంతకాలం పనులు నిలిపివేసిన ఆంధ్రప్రదేశ్‌, ఇప్పుడు గుట్టుచప్పుడు కాకుండా స్ట్రక్చర్‌ నిర్మాణం కంప్లీట్‌చేసి గేట్లు అమర్చేందుకు కసరత్తు చేస్తోందని KRMB దృష్టికి తీసుకెళ్లింది తెలంగాణ. KRMB, CWC, కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ, కర్నాటక రాష్ట్రాల అనుమతుల్లేకుండా ఆర్డీఎస్‌ కుడి కాల్వ పనులను ఏపీ పూర్తి చేసిందని లేఖలో పేర్కొంది. ఏపీ చేపట్టిన ఈ ఆర్డీఎస్‌తో తెలంగాణలోని గద్వాల జిల్లా ఆయకట్టుకు సాగునీటి కష్టాలు ఎదురవుతాయని అంటోంది. ఆర్డీఎస్‌ రైట్‌ కెనాల్‌ ద్వారా నాలుగు టీఎంసీల నీటిని అక్రమంగా ఏపీ తరలించుకుపోనుందని తెలంగాణ వాదిస్తోంది. మరి, తెలంగాణ సర్కార్‌ వరుసగా సంధిస్తోన్న లేఖలపై KRMB ఎలా రియాక్టవుతుందో? ఆంధ్రప్రదేశ్‌ ఏమంటుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..