TRSలో మళ్లీ పదవుల కోలాహలం.. రాజ్యసభ సీట్లకు మొదలైన రేస్.. గులాబీ బాస్ మనసులో ఎవరు?

|

Dec 10, 2021 | 6:18 PM

తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడి ముగిసింది. అప్పుడే అధికార పార్టీ  TRSలో మళ్లీ పదవుల కోలాహలం మొదలయ్యింది.

TRSలో మళ్లీ పదవుల కోలాహలం.. రాజ్యసభ సీట్లకు మొదలైన రేస్.. గులాబీ బాస్ మనసులో ఎవరు?
TRS Leaders
Follow us on

తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడి ముగిసింది. అప్పుడే అధికార పార్టీ  TRSలో మళ్లీ పదవుల కోలాహలం మొదలయ్యింది. ఇప్పుడు ఇక రాజ్యసభ వంతు వచ్చింది. ఉన్నవి 3 సీట్లే అయినా.. టీఆర్ఎస్‌లో ఆశావహుల సంఖ్య మాత్రం భారీగా ఉంది. రాజ్యసభ సీట్ల కోసం కారు పార్టీలో రేస్ మొదలైంది.  మరి పార్టీ అధినేత కేసీఆర్ మనసులో ఎవరున్నారు? రాజ్యసభ పదవులు టీఆర్ఎస్ లీడర్లు ఎవరికి దక్కుతాయన్నది ఆసక్తిగా మారింది.

రాజ్యసభ సీట్ల కోసం TRSలో ఆశావహులు మళ్లీ క్యూ కడుతున్నారు. బండ ప్రకాష్‌కు MLC సీటు ఇవ్వడంతో…ఆయన రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా చేశారు. అటు జూన్‌లో డి. శ్రీనివాస్‌..కెప్టెన్‌ లక్ష్మీకాంతరావు పదవీ కాలం పూర్తవుతుంది. ఈ 3 స్థానాలకు ఒకేసారి నోటిఫికేషన్‌ వస్తుందని భావిస్తున్నారు. అందుకే సీనియర్లు లాబీయింగ్ ముమ్మరం చేశారు. ఎంపీ సీటు కోసం ఎవరిప్రయత్నాలు వాళ్లు చేస్తున్నారు.

కరీంనగర్ మాజీ ఎంపీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కు ఈసారి రాజ్యసభ పక్కా అంటున్నాయి పార్టీ వర్గాలు. ఢిల్లీలో వినోద్ సేవలు అవసరం అని కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక మిగతా రెండు స్థానాల కోసం మాజీ ఎంపీ సీతారాం నాయక్‌తో పాటు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పోటీ పడుతున్నారు. వీరితో పాటు ఇటీవల MLCగా ఛాన్స్ రాని వాళ్లు కూడా ఎంపీ సీటు కోసం గట్టిగానే పైరవీ చేస్తున్నారు. ఎర్రోళ్ల శ్రీనివాస్, కర్నె ప్రభాకర్‌ కూడా క్యూలో ఉన్నట్లు సమాచారం.

TRS, CM KCR

ఇటీవలే పార్టీలో చేరిన మోతుకుపల్లి నర్సింహులు కూడా రాజ్యసభ పదవిపై ఆశలు పెట్టుకున్నారట. బీజేపీలో ఉన్నప్పుడు గవర్నర్ పదవి ఆశించిన ఆయన TRSలో ఎంపీ పదవి రాకపోతుందా అనే ధీమాలో ఉన్నారట. ఇలా చాలా మంది నేతలు ఎవరికి వారు ఎంపీ పదవులపై భారీ ఆశలే పెట్టుకున్నారు. కానీ అక్కడ ఉన్నది మాత్రం కేవలం 3 సీట్లే. మరి గులాబీ బాస్ కేసీఆర్ లిస్టులో ఎవరు ఉన్నారన్నది సస్పెన్స్. ఇటీవలి MLC ఎన్నికల మాదిరిగానే లాస్ట్‌ మినట్‌ ట్విస్టులు ఉండే అవకాశం లేకపోలేదు.

Also Read..

Covid-19: ఒమిక్రాన్, థర్డ్ వేవ్ భయాలు.. బూస్టర్ డోస్‌కు సుముఖంగా కేంద్రం.. కండీషన్స్ అప్లై

Tirupati: శ్రీవారికి అజ్ఞాత భక్తుడు భారీ విరాళం.. రూ. 3 కోట్లు విలువజేసే వరద-కఠి హస్తాల బహుకరణ