హైదరాబాద్‌లో అండర్ వాటర్ టన్నెల్ అక్వేరియం ఎక్స్‌పో ప్రారంభమైంది. మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ చేతుల మీదుగా ప్రారంభించగా.. ప్రపంచంలోని రకరకాల జాతుల చేపలు ఈ ప్రదర్శనలో అలరిస్తున్నాయి. చూడటానికి ఎంతో అద్భుతంగా ఉన్న ఈ ఎక్స్‌పోకి సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉంది. కూకట్‌పల్లి పరిధిలోని మెట్రో క్యాష్ అండ్ క్యారీ ఎదురుగా ఉన్న ట్రక్ పార్కింగ్ గ్రౌండ్‌లో ప్రదర్శన జరగుతోంది. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రదర్శన జరగుతుంది. తొలిరోజు సందర్శకులకు ఉచిత ప్రవేశం కల్పించారు.. దాదాపు 60 రోజుల పాటు ఈ ప్రదర్శన ఉండనుంది.
ఈ ఎక్స్‌పోలో అనేక రకాల అరుదైన జాతుల చేపలను చూడవచ్చు. ఇక్కడ ప్రదర్శనకు ఉంచిన చేపలలో అరభైమా రకం చేప ప్రత్యేకమైనది అని చెబుతున్నారు. ఈ చేప రోజుకు కిలోన్నర చికెన్ తింటుందని నిర్వాహకులు చెబుతున్నారు. ఈ చేప 60 కిలోలు ఉండగా.. దీని ధర ప్రస్తుతం మార్కెట్‌లో రూ.6 లక్షలు ఉందని అంటున్నారు.
అలాగే ఈ ఎగ్జిబిషన్‌లో ఇండియాలోని వివిధ రాష్ట్రాల హ్యాండీక్రాఫ్ట్స్, చేనేత వస్త్రాల స్టాళ్లను ఏర్పాటు చేశారు. ఇప్పటికే హైదరాబాద్‌తో పాటు కరీంనగర్, ఇతర పట్టణాలలో ఇలాంటి ఎగ్జిబిషన్లు జరిగాయి. అయితే, ఈసారిగా హైదరాబాద్‌లో అతిపెద్ద అండర్ వాటర్ టన్నెల్ ఎక్వేరియం ఏర్పాటు చేయడంతో సందర్శకుల నుంచి అనూహ్య ఆదరణ వస్తుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..