Dharani Commitee: ధరణీపై కమిటీ ఖరారైంది.. ఇక తర్వాత ఏంటి?

ప్రజావాణి దరఖాస్తుల పరిశీలన సహా సమస్యల పరిష్కారానికి సంబంధించిన విధివిధానాలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలోని మంత్రుల కమిటీ అల్రెడీ దృష్టి సారించింది. ఈ క్రమంలోనే మరో కీలక నిర్ణయం తీసుకున్నారు సీఎం రేవంత్‌ రెడ్డి. ధరణి సమస్యలపై ఐదుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేశారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఎం.కోదండరెడ్డి, రిటైర్డ్‌ ఐఏఎస్‌ పీటర్‌ అడ్వొకేట్‌ సునీల్, మాజీడిప్యూటీ కలెక్టర్ మధుసూదన్ సహా సీసీఎల్‌ఏ మెంబర్‌..

Dharani Commitee: ధరణీపై కమిటీ ఖరారైంది.. ఇక తర్వాత ఏంటి?
Telangana Dharani
Follow us
Subhash Goud

|

Updated on: Jan 10, 2024 | 7:42 AM

తెలంగాణ దంగల్‌లో ధరణి కేంద్రంగా సవాళ్లు -సవాళ్లు మార్మోగాయి. అధికారంలోకి వస్తే ధరణి స్థానంలో భూమాత పోర్టల్‌ను తీసుకు వస్తామని కాంగ్రెస్‌ స్పష్టం చేసింది. అధికారంలోకి రాగానే గ్యారెంటీల అమలు సహా ప్రాజెక్టులు, ధరణి వంటి కీలక అంశాలపై ఫోకస్‌ పెట్టింది రేవంత్‌ రెడ్డి సర్కార్‌. ప్రజావాణి కార్యక్రమానికి అనూహ్య స్పందన రావడం.. కోటి పైగా ఫిర్యాదులు వెల్లువెత్తడం.. వాటిల్లో భూవివాదాలకు సంబంధించిన దరఖాస్తులే ఎక్కువగా ఉండడంతో సబ్‌ కమిటీని ఏర్పాటు చేశారు సీఎం రేవంత్‌ రెడ్డి. ప్రజావాణి దరఖాస్తుల పరిశీలన సహా సమస్యల పరిష్కారానికి సంబంధించిన విధివిధానాలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలోని మంత్రుల కమిటీ అల్రెడీ దృష్టి సారించింది. ఈ క్రమంలోనే మరో కీలక నిర్ణయం తీసుకున్నారు సీఎం రేవంత్‌ రెడ్డి. ధరణి సమస్యలపై ఐదుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేశారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఎం.కోదండరెడ్డి, రిటైర్డ్‌ ఐఏఎస్‌ పీటర్‌ అడ్వొకేట్‌ సునీల్, మాజీడిప్యూటీ కలెక్టర్ మధుసూదన్ సహా సీసీఎల్‌ఏ మెంబర్‌ కన్వీనర్‌ ధరణీ కమిటీలో సభ్యలు. ధరణీ సమస్యలు, పరిష్కారాలపై ఈ కమిటీ అధ్యయనం చేస్తుంది.

ధరణీపై కమిటీ ఖరారైంది. ఇక వాట్‌ నెక్ట్స్‌?

ప్రచారపర్వంలో చెప్పినట్టుగా.. ధరణీ పోర్టల్‌లో అవకతవకవలపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారిస్తుందా? విధి విధినాల్లో మార్పులు- చేర్పులతో ధరణిని ప్రక్షాళన చేస్తుందా? లేదంటే ధరణీ ని రద్దు చేసి ప్రచారంలో చెప్పినట్టుగా భూమాత పోర్టల్‌ను తీసుకు వస్తారా? ధరణీపై వెల్లువెత్తిన ఫిర్యాదులు, ధరణి విధివిధానాల్లో లోటుపాట్లపై కమిటీ అధ్యయనం చేసే నివేదిక ఆధారంగా సరికొత్త సంచలన నిర్ణయం తెరపైకి వస్తుందా? అనే చర్చజరుగుతోంది.

ఓవైపు ప్రజాపాలనలో కీలక నిర్ణయాలు తీసుకుంటూ.. మరోవైపు జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు సీఎం రేవంత్‌ రెడ్డి. లోక్‌సభ ఎన్నికల కోడ్‌ వచ్చేలోపు కీలకమైన పనులను మొదలు పెట్టాలని అధికారయంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. అలసత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదన్నారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని సంకేతాలిచ్చారు. జనవరి 26 తర్వాత జిల్లాల్లో పర్యటిస్తానని సీఎం స్పష్టం చేశారు. ప్రతీ నియోజకవర్గానికి 10 కోట్ల స్పెషల్ డెవలెప్‌మెంట్ నిధులు కేటాయిస్తామన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి