Telangana: సరూర్‌ నగర్ గవర్నమెంట్ కాలేజీ విద్యార్థుల ఆందోళనకు దిగొచ్చిన ప్రభుత్వం.. రూ.2 కోట్లు మంజూరు

టాయిలెట్స్ లేక ఇబ్బందులు పడుతున్నామంటూ ఆందోళనకు దిగిన సరూర్ నగర్ ప్రభుత్వ కళాశాల విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వం స్పందించింది. కొన్నేళ్లుగా 400 మంది అమ్మాయిలకు ఒకటే వాష్ రూం ఉండటంతో ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని..

Telangana: సరూర్‌ నగర్ గవర్నమెంట్ కాలేజీ విద్యార్థుల ఆందోళనకు దిగొచ్చిన ప్రభుత్వం.. రూ.2 కోట్లు మంజూరు
Students
Follow us
Amarnadh Daneti

|

Updated on: Dec 22, 2022 | 11:31 AM

టాయిలెట్స్ లేక ఇబ్బందులు పడుతున్నామంటూ ఆందోళనకు దిగిన సరూర్ నగర్ ప్రభుత్వ కళాశాల విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వం స్పందించింది. కొన్నేళ్లుగా 400 మంది అమ్మాయిలకు ఒకటే వాష్ రూం ఉండటంతో ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని, అబ్బాయిలకు అది కూడా లేకపోయినా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటే విద్యార్థులకు ఆందోళనకు దిగిన విషయంత తెలిసిందే. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ భీష్మించుకు కూర్చున్నారు విద్యార్థులు. విద్యాశాఖ మంత్రి ఇలాకాలో ఉన్న ఓ ప్రభుత్వ జూనియర్ కళాశాల దుస్థితి ఇలా ఉండటంతో విద్యార్థులు నిరసనకు దిగారు. రంగారెడ్డి జిల్లా మాహేశ్వరం నియోజకవర్గంలోని సరూర్‌నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎన్నో సమస్యలు ఉన్నాయని, కాలేజీ మొత్తానికి ఒకటే వాష్‌రూం ఉందని, ఆ ఒక్క వాష్‌రూంలోనూ ఎలాంటి సదుపాయాలు లేవంటూ విద్యార్థులు నిరసనకు దిగారు. విద్యార్థులంతా ఒకటే తీరుగా మొరపెట్టుకుంటే.. మొన్నీమధ్యే ఓ పదివేల రూపాయలు ఖర్చుపెట్టి ట్యాపులు రిపేరు చేయిస్తే వాటిని కూడా గుర్తుతెలియని వ్యక్తులు పగలగొట్టి వెళ్లారు. ఈ నేపథ్యంలో కాలేజీలో చదవుతున్న విద్యార్థినుల పరిస్థితి మరీ దయనీయంగా మారింది.

కళాశాలకు వస్తే ఎక్కడ వాష్‌రూంకు వెళ్లాల్సి వస్తుందోనని.. నీళ్లు కూడా తాగట్లేదు. ఇంకొదరైంతే ట్యాబ్లెట్లు కూడా వేసుకుంటున్న దుస్థితి ఏర్పడింది. ఈ దుస్థితిని భరించలేక ఆందోళనకు దిగారు విద్యార్థులు. ఎట్టకేలకు స్పందించిన ఇంటర్‌బోర్డు అదనపు క్లాస్ రూం, కాంపౌండ్ వాల్, టాయిలెట్స్ కట్టేందుకు 2 కోట్లు మంజూరు చేసింది.

విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వం స్పందించి నిధులు మంజూరు చేసిన నేపథ్యంలో తక్షణమే పనులు ప్రారంభించి.. అదనపు టాయిలెట్లు నిర్మించాలని విద్యార్థులు కోరుతున్నారు. ఆలస్యం చేయకుండా తక్షణమే ఈ పనులు ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నారు. వాస్తవానికి చాలా పాఠశాలలు, కళాశాలల్లో టాయిలెట్ల సమస్య ఉంది. దీంతో విద్యార్థులు ఎన్నో ఇబ్బందులు పడుతున్న ఘటనలు వెలుగుచూశాయి. ఇటీవల కాలంలో స్వచ్ఛ భారత్‌ కింద పాఠశాలల్లో స్వచ్ఛాలయాల నిర్మాణం చేపట్టారు. అయినప్పటికి మరికొన్ని చోట్ల ఈ సమస్యలె ఎదురవుతూనే ఉన్నాయి. మిగిలిన చోట్ల కూడా టాయిలెట్ల సమస్యను తీర్చాలని పలు విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..

ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు