HuzurabadByElections: హుజూరాబాద్‌లో కొనసాగుతున్న పోలింగ్.. ఎన్నికపై ఈసీ డేగ కన్ను.. హైదరాబాద్ నుంచే..

HuzurabadBypoll: హుజూరాబాద్ పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. హుజూరాబాద్ ఎన్నికను పలు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో.. ఏమైనా జరుగొచ్చనే అభిప్రాయంతో..

HuzurabadByElections: హుజూరాబాద్‌లో కొనసాగుతున్న పోలింగ్.. ఎన్నికపై ఈసీ డేగ కన్ను.. హైదరాబాద్ నుంచే..
Polling

Updated on: Oct 30, 2021 | 8:28 AM

HuzurabadBypoll: హుజూరాబాద్ పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. హుజూరాబాద్ ఎన్నికను పలు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో.. ఏమైనా జరుగొచ్చనే అభిప్రాయంతో ఆ ఎన్నికపై ఈసీ డేగ కన్ను పెట్టింది. హైదరాబాద్ ఈసీ కార్యాలయం నుంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తోంది. 306 పోలింగ్ స్టేషన్ లలో వెబ్ కాస్టింగ్ ద్వారా మోనటరింగ్ చేస్తున్నారు ఎన్నికల అధికారులు. ప్రతీ పోలింగ్ బూత్‌ను ఈసీ కార్యాలయం నుంచి పర్యవేక్షించేలా ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా 127 సమస్యాత్మక ప్రాంతాలపై ఎలక్షన్ కమిషన్ దృష్టి పెట్టింది. పోలింగ్ కోసం 421 కంట్రోల్ యూనిట్లను ఏర్పాటు చేశారు. 891 బ్యాలెట్ యూనిట్లు, 515 వివిప్యాట్లను వినియోగిస్తున్నారు. కాగా, పోలింగ్ విధుల్లో 1,715 మంది సిబ్బంది ఉండగా.. రెండు డోసుల టీకా తీసుకున్న వారినే ఎన్నికల విధుల్లో నియమించింది రాష్ట్ర ఎన్నికల సంఘం. ఇక ఎన్నికల విధుల కోసం 20 కంపెనీల బలగాలను వినియోగిస్తున్నారు.


Also read:

Solar Flare: సూర్యునిలో మంట.. సౌర తుపానుగా భూమిపైకి.. కమ్యూనికేషన్లపై కనిపించనున్న ఎఫెక్ట్!

Badvel By Election: పోరుమామిళ్ల రంగసముద్రంలో ఆలస్యంగా పోలింగ్ ప్రారంభం.. ఓటు వేసిన కాంగ్రెస్ అభ్యర్థి కమలమ్మ..

చనిపోయిన యువతీయువకులకు ఘనంగా వివాహం.. ఈ వింత ఆచారం ఎక్కడంటే..