
Telangana Inter Hall Tickets: తెలలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ TSBIE ఇంటర్మీడియట్ హాల్ టికెట్స్‌ని విడుదల చేసింది. విద్యార్థులు బోర్డుకు సంబంధించిన అధికారిక వెబ్‌సైట్ https://tsbie.cgg.gov.in/ ద్వారా హాల్‌టికెట్స్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇంటర్ ఎన్విరోన్మెంటల్, ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ హాల్ టికెట్స్ ను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసింది తెలంగాణ బోర్డ్ ఆప్ ఇంటర్మీడియేట్. వెబ్‌సైట్‌తో పాటు విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన TSBIE SERVICES యాప్‌లో కూడా హాల్ టికెట్స్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. తెలంగాణలో మే 1 నుంచి 20 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతున్న సంగతి తెలిసిందే. మరి ఈ పరీక్షలకు హాల్ టికెట్స్ ఎలా డౌన్‌లోడ్ చేయాలో తెలుసుకోండి.
Telangana Inter Hall Tickets: ఇంటర్ హాల్ టికెట్స్ డౌన్‌లోడ్ చేయండి ఇలా
✒ ముందుగా https://tsbie.cgg.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయండి.
✒ హోమ్ పేజీలో Hall Tickets Download సెక్షన్ కనిపిస్తుంది.
✒ అందులో First Year, Second Year, Bridge Course, పేరుతో మూడు ట్యాబ్స్ ఉంటాయి.
✒ ఎన్విరోన్మెంటల్, ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ హాల్ టికెట్స్” అని లింక్‌పై క్లిక్ చేయండి.
✒ కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో మీ వివరాలు ఎంటర్ చేసి హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేయాలి.
✒ మీ ఇంటర్ హాల్ టికెట్ నెంబర్ లేదా ఎస్ఎస్‌సీ హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ ఎంటర్ చేయాలి.
✒ ఇది TSBIE యొక్క వెబ్‌సైట్ యొక్క క్రొత్త పేజీకి నిర్దేశించబడుతుంది
✒ Get Hall Ticket పైన క్లిక్ చేస్తే మీ హాల్ టికెట్ కనిపిస్తుంది.
✒ హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకోవాలి.
✒ హాల్ టికెట్‌లోని ఇన్‌స్ట్రక్షన్స్ పూర్తిగా చదవాలి.
✒ నేరుగా ఇంటర్ హాల్ టికెట్స్ డౌన్‌లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
అధికారిక వెబ్‌సైట్ః https://tsbie.cgg.gov.in/envethicsipehalltickes.do
ప్రత్యేక పోర్టల్‌తో పాటు 040 24600110 నెంబర్‌తో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది.
ఇదిలావుంటే, కరోనా ఎఫెక్ట్ తో ఈ విద్యా సంవత్సరం కూడా అంతా గందరగోళంగా సాగుతోంది. అయితే కరోనా ప్రభావం తగ్గడంతో విద్యా సంస్థలను ప్రారంభించిన ప్రభుత్వం మళ్లీ కేసులు పెరగడంతో వాటిని మూసి వేసింది. ఇంటర్ బోర్డు కూడా ప్రాక్టికల్ పరీక్షలను ప్రస్తుతానికి వాయిదా వేయాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. వాయిదా వేయాలా? లేక రద్దు చేయాలా? అన్న అంశంపై సైతం బోర్డు ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.
అందులో ఒకటి ఏప్రిల్ 7 నుంచి జరగాల్సిన పరీక్షలను వాయిదా వేసి ఏప్రిల్ 10 నుంచి నిర్వహించాలని మొదటి ఆలోచనగా అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇంటర్ పబ్లిక్ పరీక్షలు, జేఈఈ పరీక్షలు ముగిసిన అనంతరం చివరకు ప్రయోగ పరీక్షలు నిర్వహించాలన్నది మరో ఆలోచనగా తెలుస్తోంది. ఒక వేళ ఇదే జరిగితే ప్రాక్టికల్ పరీక్షలు మే చివరలో జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఇదిలా ఉంటే.. వివిధ జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ తో పాటు ఎంసెట్ షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఎలాగైనా ఇంటర్ పరీక్షలు రద్దు చేసే ప్రసక్తే లేదని అధికారులు చెబుతున్నారు. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా కరోనా నిబంధనలు పాటిస్తూ పరీక్షలు నిర్వహించేందుకు యంత్రాంగం సిద్ధమవుతోంది. ఎవరైనా విద్యార్థులు చివరకు పరీక్షలు రద్దు అవుతాయన్న ఆలోచనతో ప్రిపేర్ కాకుండా ఉంటే మాత్రం నష్టపోయే ప్రమాదం ఉంది.
ఇదీ చదవండి… Vodafone Idea: జనవరిలో భారీస్థాయిలో వినియోగదారులను కోల్పోయిన వోడాఫోన్ ఐడియా