సంగారెడ్డి అర్బన్: సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ మాధురి వద్ద సీసీ (క్యాంప్ క్లర్క్)గా పనిచేస్తున్న గడిల విష్ణువర్ధన్ (44) అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. ఆదివారం (అక్టోబర్ 29) ఉదయం కొండాపూర్ మండలం తెలంగాణ టౌన్‌షిప్ వద్ద పూర్తిగా కాలిపోయిన స్థితిలో ఆయన మృతదేహం లభ్యమైంది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ మాధురి వద్ద క్యాంప్ క్లర్క్‌గా విధులు నిర్వహిస్తోన్న విష్ణువర్ధన్‌కు భార్య శివ కృష్ణ కుమారి, కుమార్తె వైష్ణవి (18), కుమారుడు హర్షవర్ధన్ (16) ఉన్నారు. శనివారం మధ్యాహ్నం నుంచి విష్ణువర్ధన్ ఇంటికి వెళ్లలేదు. రాత్రి భార్య ఫోన్ చేస్తే విష్ణు మాట్లాడినట్లు సమాచారం. అనారోగ్య కారణాలతో గత నెలరోజులుగా విష్ణు సెలవుపై ఉన్నట్లు కలెక్టరేట్ వర్గాలు తెలిపాయి. కొండాపూర్ మండలంలోని తెలంగాణ టౌన్ షిప్ దగ్గర కాలిన గాయాలతో విష్ణువర్ధన్ మృతదేహం లభ్యమైంది. కాగా విష్ణువర్ధన్‌ది ఎవరైనా హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారా? లేదా నిజంగానే ఆత్మహత్యకు పాల్పడ్డాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అలాగు కుటుంబ కలహాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలోనూ విచారిస్తున్నారు. అయితే ఆకస్మాత్తుగా ఆయన మరణించడంతో కుటుంబంలో విషాదం నింపింది.
గుజరాత్‌లోని సూరత్‌లో శనివారం ఘోర సంఘటన వెలుగు చూసింది. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు సామూహిక ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతుల్లో ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. కాంట్రాక్టర్‌గా పనిచేసే మనీశ్ సోలంకి (37), అతడి తల్లిదండ్రులు, భార్య, అతడి ముగ్గురు పిల్లలు వారి ఇంట్లో విగతజీవులుగా కనిపించారు. వీరిలో మనీశ్ సోలంకి మృతదేహం ఉరికి వేలాడుతూ కనిపించింది. మిగిలిన ఇంట్లో చెల్లాచెదురుగా పడిఉన్నాయి. వారి ఇంట్లో పాయిజన్ బాటిల్, సూసైడ్ లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అప్పుడు, ఆర్థిక సమస్యలతోనే తాము చనిపోతున్నామని సూసైడ్ నోట్‌లో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు.