RTC Bus Services : తెలంగాణ అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు నేటి నుంచి ప్రారంభం.. ఆంధ్ర, కర్నాటకకు టీఎస్ఆర్టీసీ రాకపోకలు

కరోనా మహమ్మారి కారణంగా ఇంతకాలం మూలన పడిపోయిన తెలంగాణ ఆర్టీసీ బస్సులు ఇవాళ్టి నుంచి పూర్తి స్థాయిలో రోడ్ల మీదకు వచ్చాయి..

RTC Bus Services : తెలంగాణ అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు నేటి నుంచి ప్రారంభం..  ఆంధ్ర, కర్నాటకకు టీఎస్ఆర్టీసీ రాకపోకలు
TSRTC

Updated on: Jun 21, 2021 | 9:09 AM

TSRTC Bus Services : కరోనా మహమ్మారి కారణంగా ఇంతకాలం మూలన పడిపోయిన తెలంగాణ ఆర్టీసీ బస్సులు ఇవాళ్టి నుంచి పూర్తి స్థాయిలో రోడ్ల మీదకు వచ్చాయి. తెలుగు రాష్ట్రాలు సహా కర్నాటకకు టీఎస్ఆర్టీసీ తన బస్సు సర్వీసులను నేటి నుంచి నడుపుతోంది. కరోనా తగ్గుముఖం పడుతుండటంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు లాక్ డౌన్ సడలింపుల బాట పట్టాయి. అయితే, తెలంగాణలో మాత్రం పూర్తి స్థాయిలో లాక్ డౌన్ ఎత్తి వేసిన సంగతి తెలిసిందే. దీంతో అంతర్‌ రాష్ట్ర బస్సు సర్వీసులకు కూడా తెలంగాణ ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఫలితంగా తెలంగాణ నుంచి అంతర్‌ రాష్ట్ర సర్వీసులు పూర్తి స్థాయిలో నడుస్తున్నాయి. ఈ మేరకు నిన్ననే టీఎస్ఆర్టీసీ ఒక ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే.

అయితే, ఏపీలో లాక్‌డౌన్‌ నిబంధనలకు అనుగుణంగా బస్సు సర్వీసులు నడుపుతోంది టీఎస్‌ ఆర్టీసీ. అటు, ఏపీలో ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు లాక్ డౌన్ కర్ఫ్యూ సడలించిన నేపధ్యంలో ఈ టైమింగ్స్ కు అనుగుణంగా బస్సులు తిప్పడం షురూ చేశారు. కర్ఫ్యూ సడలించిన వేళల్లో ప్రయాణికులు గమ్య స్థానం చేరుకునేలా బస్సులు నడిపుతున్నారు. ఏపీ నుంచి తెలంగాణకు, తెలంగాణ నుంచి ఏపీకి ఏపీ కర్ఫ్యూ వేళలకు అనుగుణంగా బస్సులు నడుస్తున్నాయి.

అటు, తెలంగాణ నుంచి కర్నాటకకు కూడా బస్సులు తిరుగుతున్నాయి. కర్నాటకలో కూడా వారాంతాల్లో లాక్ డౌన్ కొనసాగిస్తూ కర్ఫ్యూ ఆంక్షలు సడలించిన నేపథ్యంలో ఈ మేరకు తెలంగాణ సర్కారు నిర్ణయం తీసుకుంది. కర్నాటకలో కర్ఫ్యూ సడలింపులకు అనుగుణంగా తెలంగాణ నుంచి కర్నాటకకు.. కర్నాటక నుంచి తెలంగాణకు టీఎస్ ఆర్టీసీ బస్సులు నడుపుతున్నారు. ఇలా ఉండగా, ఫలితంగా కర్నాటకలో ఉదయం 5 నుంచి సాయంత్రం 7 వరకు బెంగళూరు మినహా మిగిలిన ప్రాంతాలకు బస్సులు నడుస్తాయి. వీకెండ్స్ లో మాత్రం లాక్ డౌన్ నేపధ్యంలో శుక్రవారం సాయంత్రం నుంచి సోమవారం ఉదయం వరకు తెలంగాణ నుంచి కర్నాటకకు.. కర్నాటక నుంచి తెలంగాణకు ఎలాంటి బస్సులు తిరగవు.

Read also : PM Modi Yoga : కరోనా నుంచి పోరాడేందుకు యోగాను సురక్షా కవచంగా మార్చుకోండి : M-Yoga app రిలీజ్ చేసిన ప్రధాని