తెలంగాణ రైజింగ్-2047 లక్ష్యం ఏంటో తెలుసా..? ప్రధాన ఫోకస్ దేని మీద..?
భారత్‌లో ఎన్నో నగరాలున్నాయ్. తెలంగాణ కంటే, హైదరాబాద్ కంటే ధనిక రాష్ట్రాలు, రాజధానులున్నాయ్. పైగా చైనా, జపాన్ వంటి దేశాలతో.. న్యూయార్క్, టోక్యో వంటి నగరాలతోనే తమకు పోటీ అంటోంది తెలంగాణ. ఇన్ని నగరాలు, రాష్ట్రాలను కాదని హైదరాబాద్ అండ్ తెలంగాణలోనే ఈ స్థాయి అభివృద్ధి ఎలా సాధ్యం? దీనికో సమాధానం ఉంది. కొన్నేళ్లలో అమెరికా, ఆసియా, యూరప్‌లో పనిచేసే యూత్, టాలెంట్ ఉన్న యూత్ ఉండేది మనదేశంలోనే. అవకాశాలన్నీ కట్టగట్టుకుని వెతుక్కుంటూ వచ్చేది భారత్‌నే. ఒకసారి భారత్‌వైపు చూశాక.. వాళ్లని తమ రాష్ట్రానికి రప్పించుకోవడమే అసలు టాలెంట్. ఏ రాష్ట్రంలో అడుగుపెడితే బెనిఫిట్ ఉంటుందో చూస్తాయి ఇంటర్నేషనల్ కంపెనీలు. తెలంగాణలో ఉన్న ఆ అవకాశాలను చూపించడానికే ఈ గ్లోబల్ సమిట్, ఈ విజన్ డాక్యుమెంట్. ఈ ముందుచూపుతోనే 3 ట్రిలియన్ డాలర్ ఎకానమీని టార్గెట్‌గా పెట్టుకుంది తెలంగాణ.

భవిష్యత్తులో తెలంగాణ ఎలా ఉండబోతుందనే దానిపై రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రంగరాజన్ ఓ ఆర్నెళ్ల క్రితం ఓ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. 2047 నాటికి.. అంటే స్వతంత్ర భారతావనికి సరిగ్గా వందేళ్లు పూర్తయ్యే సమయానికి.. దేశంలో అన్నివిధాలుగా, అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన రాష్ట్రాలు ఓ నాలుగు ఉంటాయి. ఆ నాలుగు రాష్ట్రాల్లో ఒకటి.. తెలంగాణ. ఇదే ఇన్‌స్పిరేషన్‌తో ముందుగా వన్ ట్రిలియన్ డాలర్ల ఎకానమీని టార్గెట్‌గా పెట్టుకుంది తెలంగాణ గవర్నమెంట్. తేలికైన మాటల్లో చెప్పాలంటే తెలంగాణ విలువెంత అని అడిగితే 90 లక్షల కోట్ల రూపాయలు అని చెప్పగలగాలి. అది కూడా జస్ట్ పదేళ్లలో చేరుకోవాలి. విజన్-2035 టార్గెట్ అది. ‘అంతకు మించి’ అన్నట్టుగా 2047 నాటికి ‘త్రీ ట్రిలియన్ డాలర్’ ఎకానమీగా తెలంగాణను మార్చాలనుకుంటోంది. అంటే.. అప్పటికి తెలంగాణ విలువ ‘270 లక్షల కోట్ల రూపాయలు’ ఉండాలనుకుంటోంది. అందుకోసం ఓ విజన్ డాక్యుమెంట్ రెడీ చేస్తోంది. దాని పేరు ‘తెలంగాణ రైజింగ్-2047’. మరో 22 ఏళ్లలో చైనా, జపాన్ స్థాయిలో తెలంగాణ ఉండాలనేదే అల్టిమేట్ టార్గెట్. మరి… ఆ రేంజ్ డెవలప్‌మెంట్ ఉండాలంటే ఎలాంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలి? దాన్నే ఆవిష్కరించబోతోంది గ్లోబల్ సమ్మిట్‌లో. డిసెంబర్ 8, 9 తేదీల్లో.. ఫోర్త్ సిటీలో జరిగే సమ్మిట్‌లో ఈ రూట్ మ్యాప్ రిలీజ్ చేయబోతోంది. తెలంగాణ రైజింగ్-2047 లక్ష్యం ఏంటో తెలుసు. అందులో ప్రధానంగా ఫోకస్ చేస్తున్నది దేని...




