Telangana Rains: తెలంగాణకు చల్లని కబురు..! నేడు.. రేపు రాష్ట్రంలో తేలికపాటి వర్షాలు..

|

Feb 24, 2024 | 8:16 AM

మరోవైపు రాష్ట్రంలో చాలా చోట్ల ప్రజలు జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్నారు. ఆస్పత్రుల వద్ద బాధితుల సంఖ్య కూడా ఎక్కువగా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ప్రధానంగా చిన్న పిల్లలు, వృద్ధులు ఇలాంటి వాతావరణ పరిస్థితుల నుంచి కాపాడుకొనేందుకు జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు. వాతావరణ మార్పుల వల్ల పిల్లల్లో..

Telangana Rains: తెలంగాణకు చల్లని కబురు..! నేడు.. రేపు రాష్ట్రంలో తేలికపాటి వర్షాలు..
Rainy
Follow us on

తెలంగాణలో గత కొద్ది రోజులుగా భిన్న వాతావరణం కనిపిస్తోంది. పగలంతా ఎండవేడి, ఉక్కపోత ఉంటే,.. రాత్రి చలి తీవ్రత కొనసాగుతుంది. ఇలాంటి టైమ్‌లో వాతావరణశాఖ కూల్‌ న్యూస్‌ చెప్పింది…రాష్ట్రంలో తేలికపాటి వర్షాలు కురుస్తాయనే చల్లని కబురు చెప్పింది. తెలంగాణలో శని, ఆదివారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ శుక్రవారం ప్రకటించింది. రాష్ట్రంపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా అక్కడక్కడ చిరు జల్లులు కురిసే అవకాశం ఉందని సూచించింది. హైదరాబాద్ లోనూ ఇవాళ రేపు భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది.  అటు ఏపీలోనూ రెండు రోజుల పాటు అక్కడకక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

కాగా రాష్ట్రంలో 3 రోజులుగా పగటిపూట ఉష్ణోగ్రతలు ఖమ్మం, నల్గొండ మినహా మిగిలిన ప్రాంతాల్లో సాధారణ స్థాయిలోనే నమోదవుతున్నాయి. రాత్రిపూట ఖమ్మం, హైదరాబాద్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో సాధారణం కన్నా 2 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఇకపోతే రాష్ట్రంలో ఈరోజు కనిష్ట ఉష్ణోగ్రత 21 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశం ఉండగా, గరిష్ట ఉష్ణోగ్రత 34 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకునే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

ఇవి కూడా చదవండి

మరోవైపు రాష్ట్రంలో చాలా చోట్ల ప్రజలు జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్నారు. ఆస్పత్రుల వద్ద బాధితుల సంఖ్య కూడా ఎక్కువగా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ప్రధానంగా చిన్న పిల్లలు, వృద్ధులు ఇలాంటి వాతావరణ పరిస్థితుల నుంచి కాపాడుకొనేందుకు జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు. వాతావరణ మార్పుల వల్ల పిల్లల్లో ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని, చిన్న పిల్లలు అంటు వ్యాధుల బారిన పడకుండా రోగ నిరోదక శక్తి పెరగడానికి పరిశుభ్రతను పాటిస్తూ.. సరైన ఆహారం తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. అంటు వ్యాధులతో బాధపడుతున్న పిల్లలను రక్షించుకోవడానికి ప్రతి ఇంట్లో దగ్గు, జలుబు, జ్వరం వంటి మందులను స్టోర్ చేసుకోని పెట్టుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..