Srinivas Rao: ‘అంతా తాయత్తు మహిమ’.. డీహెచ్‌ శ్రీనివాస్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు.. సర్వత్రా విమర్శల వర్షం

|

Apr 18, 2023 | 12:14 PM

ఖమ్మం జిల్లాలో జరిగిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న శ్రీనివాస్ రావు ఈ వ్యాఖ్యలు చేశారు. చిన్నతనంలో తాయత్తు వల్లే తాను బతికి ఉన్నానంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాగా తెలంగాణ డీహెచ్‌ శ్రీనివాసరావు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇప్పుడేం కొత్త కాదు. గతంలో ఆయన ఏసు క్రీస్తు దయ, కృపతో కరోనా కట్టడి అయ్యిందన్న కామెంట్లో అప్పట్లో దుమారం రేపాయి.

Srinivas Rao: అంతా తాయత్తు మహిమ.. డీహెచ్‌ శ్రీనివాస్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు.. సర్వత్రా విమర్శల వర్షం
Dh Srinivasa Rao
Follow us on

తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్‌.. మరోసారి వివాదాస్పద కామెంట్లు చేశారు. ఒక డాక్టర్‌ అయి ఉండి.. తాయత్తును ఆకాశానికెత్తేశారు. అసలు తాను ఈ స్థాయిలో ఉండటానికి తాబీజ్‌ (తాయత్తు) మహిమే కారణమన్నారు. ఖమ్మం జిల్లాలో జరిగిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న శ్రీనివాస్ రావు ఈ వ్యాఖ్యలు చేశారు. చిన్నతనంలో తాయత్తు వల్లే తాను బతికి ఉన్నానంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాగా తెలంగాణ డీహెచ్‌ శ్రీనివాసరావు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇప్పుడేం కొత్త కాదు. గతంలో ఆయన ఏసు క్రీస్తు దయ, కృపతో కరోనా కట్టడి అయ్యిందన్న కామెంట్లో అప్పట్లో దుమారం రేపాయి. ఆయనపై క్రిమినల్‌ కేసులు పెట్టాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు వీహెచ్‌పీ నేతలు. తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్.. వివాదాలకు కేరాఫ్ గా నిలుస్తూనే ఉన్నారు. అప్పట్లో వివాదాస్పద సర్క్యులర్ జారీ చేశారు. సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో మొక్కలు నాటాలని.. రోగులకు పండ్లు పంపిణీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అది కాస్తా వివాదాస్పదంగా మారింది. ముఖ్యమంత్రి పుట్టిన రోజున పండ్లు పంపిణీ చేయమంటూ.. వైద్య సిబ్బందిని ఆదేశించడంపై పలువురు మండిపడ్డారు. గతంలో డీహెచ్ శ్రీనివాస్ ఏసు క్రీస్తు దయతోనే కరోనా తగ్గిందని కాంట్రవర్సియల్ కామెంట్స్ చేశారు. అంతే కాదు అప్పట్లో ఓ మహిళా ఎంపీపీతో కలిసి పూజల్లో పాల్గొన్నారు డీహెచ్.

అలాగే కేసీఆర్ కాళ్లపై పడి పడి మొక్కిన దృశ్యం కూడా అప్పట్లో తీవ్ర సంచలనంగా మారింది. కేసీఆర్‌ కాళ్లు మొక్కిన తర్వాత విమర్శలు రావడంతో దానికి ఆయన వివరణ ఇచ్చారు. ఇదిలా ఉంటే శ్రీనివాసరావు కావాలని కామెంట్లు చేస్తారో.. కామెంట్లు చేశాక కాంట్రవర్శీ అవుతాయో తెలియదు. కానీ డీహెచ్‌ ఏం మాట్లాడినా వివాదం అవుతూనే ఉంది. లేటెస్ట్‌గా తాయత్తు వ్యాఖ్యలపై ఆయన ఎలాంటి వివరణ ఇస్తారో చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం.. క్లిక్ చేయండి..