లైంగిక వేధింపుల కేసులో చర్లపల్లి జైలు డిప్యూటీ సూపరింటెండెంట్‌పై వేటు పడింది. చర్లపల్లి జైలు డిప్యూటీ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న చింతల దశరథం తనను వేధిస్తున్నారంటూ ఓ ఖైదీకి సంబంధించిన సోదరి ఫిర్యాదు చేసింది. వీడియో కాల్ చేస్తేనే పెరోల్‌కు సహకరిస్తానంటూ వేధించారనేది ఆయనపై వచ్చిన ఆరోపణ. ఇతనిపై గతంలోనూ లైంగిక వేధింపుల ఆరోపణలు ఉన్నాయి. న్యూడ్ వీడియో కాల్ చేయాలని లైంగికంగా వేధిస్తున్నాడని ఓ మహిళ ఫిర్యాదు చేసింది. చింతల దశరథం.. చర్లపల్లి సెంట్రల్ జైలు డిప్యూటీ సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే.. విధుల్లో భాగంగా జైలుకు వెళ్లి దశరథం.. అసలు పని చేయకుండా వికృత చేష్టలకే ప్రాధాన్యమిచ్చాడు. జైలుకు ములాకత్ కోసం వచ్చే ఖైదీల భార్యలను లైంగికంగా వేధించటమే పనిగా పెట్టుకున్నాడు. దశరథం వేధింపులు రోజు రోజుకి మీతిమీరి పోవడంతో ఖైదీల భార్యలు జైళ్ల శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయటంతో ఆయన అరాచకాలు బయటపడ్డాయి.
ఖైదీల భార్యలు ఫిర్యాదు చేయడంతో తెలంగాణ జైళ్ల శాఖ డీజీ జితేందర్ విచారణకు ఆదేశించారు. దశరథంపై వస్తున్న ఆరోపణలపై విచారణ జరిపి పూర్తి వివరాలు సేకరించారు. ఖైదీల కుటుంబ సభ్యుల ఆరోపణలు నిజమని దర్యాప్తులో తేలడంతో జైళ్ల శాఖ డీజీ జితేందర్ చర్యలు తీసుకున్నారు. మొదట చింతల దశరథంపై బదిలీ వేటు వేశారు. చర్లపల్లి సెంట్రల్ జైలు నుండి చర్లపల్లి వ్యవసాయ క్షేత్రానికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
గతంలోనూ చింతల దశరథంపై అనేక ఆరోపణలు రాగా.. ఈ ఘటనలో అవి కూడా బయటికి వస్తున్నాయి. ఆన్‌లైన్‌లో న్యూడ్‌కాల్స్ చేసి లక్షల రూపాయలు పోగొట్టుకున్నట్టు దశరథంపై ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇప్పటికే దశరథంపై 3 కేసులు ఉన్నాయి. అయినా తీరు మార్చుకోకపోవడంతో జైళ్లశాఖ వేటువేసింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం