Telangana Curfew: కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తే కటకటాలే.. తెలంగాణ పోలీసుల సీరియ‌స్ వార్నింగ్

తెలంగాణలో కరోనా నిబంధనలు కఠినతరం చేసింది ప్రభుత్వం. కరోనా వ్యాప్తిని నివారించేందుకు నైట్‌ కర్ఫ్యూ విధించింది. అయితే నైట్‌ కర్ఫ్యూ పక్కాగా...

Telangana Curfew: కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తే కటకటాలే.. తెలంగాణ పోలీసుల సీరియ‌స్ వార్నింగ్
Telangana-Police

Updated on: May 10, 2021 | 2:40 PM

తెలంగాణలో కరోనా నిబంధనలు కఠినతరం చేసింది ప్రభుత్వం. కరోనా వ్యాప్తిని నివారించేందుకు నైట్‌ కర్ఫ్యూ విధించింది. అయితే నైట్‌ కర్ఫ్యూ పక్కాగా అమలు చేసేందుకు పోలీసులను రంగంలోకి దింపింది ప్రభుత్వం. ప్రభుత్వ ఆదేశాలతో పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తే కటకటాలేనని హెచ్చరిస్తున్నారు. రాచకొండ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ కరోనా నిబందనల అమలుకు గట్టి చర్యలు తీసుకుంటున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవంటూ హెచ్చరిస్తున్నారు. బాలాపూర్ పోలీస్ నేషన్ పరిధిలోని ఎర్రకుంట ప్రాంతాల్లో అర్దరాత్రి అకస్మికంగా సందర్శించారు. కరోనా నివారణలో ప్రజలు పోలీసులకు సహకరించాలని మహేశ్‌ భగవత్‌ కోరారు.

దేశంలో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాలని లేదంటే వెయ్యి రూపాయలు జరిమానా విధిస్తామని తెలిపారు. భౌతిక దూరం పాటిస్తూ కరోనా రాకుండా జాగ్రత్త పడాలన్నారు. రాచకొండ కమీషనరేట్ పరిధిలో 46 చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వివాహలకు 100 మంది, అంత్యక్రియలకు కేవలం 20 మందికి మించకూడదని తెలిపారు.

Also Read:  భార‌త ప్ర‌భుత్వ రంగ సంస్థ‌లో ఉద్యోగాలు.. ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేదీ మే 15 ..

ప్రధాని నరేంద్రమోదీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఫోన్‌.. సీఎంను అభినందించిన మోదీ