Telangana: గూగుల్ మ్యాప్ ఫాలో అవుతూ వాగులో చిక్కుకున్నకారు.. 9 మంది ప్రయాణీకులను రక్షించిన పోలీసులు

|

Sep 09, 2024 | 8:08 AM

కారులో మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం చిన్న ఆదిరాల గ్రామానికి చెందిన 9 మంది వ్యక్తులు ప్రయాణిస్తున్నారు. వరదలో కొట్టుకుపోతున్న కారుని.. అందులో ప్రయాణిస్తున్న ప్రయాణీకులను ట్రాక్టర్ల సహాయంతో పోలీసులు, స్థానికుల సహాయంతో కాపాడారు. కారులో ఉన్న ప్రయాణీకులు గోవిందు (35), చందు (35), బిచ్చ(33), రవి (30) రాజేంద్రప్రసాద్ (22) శ్రీకాంత్ (13) సంజన (4) కార్తీక్ (4) సంతోష్ (27)లుగా గుర్తించారు.

Telangana: గూగుల్ మ్యాప్ ఫాలో అవుతూ వాగులో చిక్కుకున్నకారు.. 9 మంది ప్రయాణీకులను రక్షించిన పోలీసులు
Nagarkurnool
Follow us on

నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు మండలం సిరిసివాడలో ఘోర ప్రమాదం తప్పింది. వేగంగా ప్రవహిస్తున్న దుందుభి వాగులో ఓ కారు కొట్టుకుపోతుండగా సమాచారం అందుకున్న పోలీసులు స్థానికుల సహాయంతో ప్రయాణికులను రక్షించారు. కారులో మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం చిన్న ఆదిరాల గ్రామానికి చెందిన 9 మంది వ్యక్తులు ప్రయాణిస్తున్నారు. వరదలో కొట్టుకుపోతున్న కారుని.. అందులో ప్రయాణిస్తున్న ప్రయాణీకులను ట్రాక్టర్ల సహాయంతో పోలీసులు, స్థానికుల సహాయంతో కాపాడారు. కారులో ఉన్న ప్రయాణీకులు గోవిందు (35), చందు (35), బిచ్చ(33), రవి (30) రాజేంద్రప్రసాద్ (22) శ్రీకాంత్ (13) సంజన (4) కార్తీక్ (4) సంతోష్ (27)లుగా గుర్తించారు.

శ్రీశైలం నుంచి గూగుల్ మ్యాప్ ఫాలో అవుతూ వస్తుండగా కారు వాగులో చిక్కుకుంది. దీంతో ప్రయాణీకులను స్థానికులు చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే తన సిబ్బందితో రంగంలోకి దిగిన ఎస్ఐ మహేష్.. ట్రాక్టర్ల తో వాగులోకి వెళ్లి గ్రామస్తుల సాయంతో ప్రయాణికులను క్షేమంగా బయటకు తీసుకొచ్చారు. ఈ రెస్క్యూ ఆపరేషన్ సీఐ కనకయ్య పర్యవేక్షణలో సక్సెస్ ఫుల్ గా సాగింది.

ఇవి కూడా చదవండి

 

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..