Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఇంటర్ విద్యార్థులకు గొప్ప అవకాశం.. ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కాలేజీ యాజమాన్యాలకు కీలక సూచనలు..

Telangana: ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కాలేజీలలో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (IISER) విద్యా

Telangana: ఇంటర్ విద్యార్థులకు గొప్ప అవకాశం.. ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కాలేజీ యాజమాన్యాలకు కీలక సూచనలు..
Vinod Kumar
Follow us
Shiva Prajapati

|

Updated on: Feb 28, 2022 | 7:31 PM

Telangana: ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కాలేజీలలో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (IISER) విద్యా సంస్థలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్(బీఎస్), మాస్టర్ ఆఫ్ సైన్స్(ఎంఎస్) కోర్సుల్లో అడ్మిషన్లకు గొప్ప అవకాశం ఉందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు.

సోమవారం జాతీయ సైన్స్ డే సందర్భంగా రాష్ట్ర విద్యా శాఖ ఉన్నతాధికారులు, ఇంటర్ విద్య కమిషనర్ ఉమర్ జలీల్‌తో వినోద్ కుమార్ మాట్లాడారు. బీఎస్, ఎంఎస్ కోర్సుల్లో చేరేందుకు ఇంటర్ విద్యార్థులకు సమాయత్తం చేయాలని వినోద్ కుమార్ రాష్ట్ర విద్యా శాఖ ఉన్నతాధికారులు, ఇంటర్ విద్య కమిషనర్ ఉమర్ జలీల్‌కు సూచించారు. ‘ఐసర్’ అటానమస్ విద్యా సంస్థలు కేంద్ర ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. బెర్హంపూర్, భోపాల్, కోల్‌కతా, మొహాలీ, పూణే, తిరువనంతపురం, తిరుపతి ప్రాంతాల్లో ‘ఐసర్’ సంస్థలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

ఇంటర్ ఎంపీసీ, బైపీసీ తరువాత ఇంజనీరింగ్, మెడిసిన్ చదువులు మాత్రమే అని విద్యార్థులు సహా వారి తల్లిదండ్రులు భావిస్తున్నారని, అయితే ఈ దృక్పథం మారాల్సిన అవసరం ఉందని వినోద్ కుమార్ అభిప్రాయపడ్డారు. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT), ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) స్థాయిలో ‘ఐసర్’ విద్యా సంస్థను కేంద్ర ప్రభుత్వం స్థాపించిందని ఆయన తెలిపారు.

విదేశాల్లో చదివే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంఎస్ తరహాలో ‘ఐసర్’ ద్వారా బీఎస్, ఎంఎస్ కోర్సులు మంచి ప్రాధాన్యతతో కూడుకున్నవని ఆయన తెలిపారు. సైన్స్ రంగంలో బీఎస్, ఎంఎస్ కోర్సులకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మంచి అవకాశాలు ఉంటాయని పేర్కొన్నారు. సైన్స్ కోర్సులకు ఎప్పటికీ ప్రాధాన్యత ఉంటుందని అన్నారు. బోటనీ, జువాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయో టెక్నాలజీ కోర్సుల్లో విద్యార్థులకు ప్రావీణ్యతను మెరుగుపర్చాల్సిన అవసరం ఉందని అన్నారు.

Also read:

Medicine Price: అదిరిపోయే శుభవార్త చెప్పిన భారత ప్రభుత్వం.. వాటి రేట్లను భారీగా తగ్గించేసింది..!

Telangana Assembly : తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. ఈసారి బడ్జెట్ సమావేశాల్లో మునుపెన్నడూ లేని విధంగా..

Andhra Pradesh: పెళ్లిల్లే అతని ఆదాయ వనరులు.. కష్టపడుతున్నాడని అనుకునేరు.. మ్యాటర్ తెలిస్తే మీటర్ లేచిపోద్ది..!