Telangana: ఒక్కటీ కాదు.. రెండు కాదు.. ఏకంగా ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు

Telangana: గంగాధర బీసీ వెల్ఫేర్ స్కూల్‌లో ఇంగ్లీష్ టీచర్‌గా పనిచేస్తున్నారు. ప్రతి పరీక్షను సవాలుగా తీసుకొని చదివారు. దీంతో..సబ్జెక్టు ఫై పట్టు సాధించారు. ఒకే వ్యక్తి.. ఐదు ఉద్యోగాలు సాధించడం చాలా అరుదు. ఈయన ఐ

Telangana: ఒక్కటీ కాదు.. రెండు కాదు.. ఏకంగా ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు
Follow us
G Sampath Kumar

| Edited By: Subhash Goud

Updated on: Nov 24, 2024 | 12:41 PM

ఒక్క ఉద్యోగం రావాలంటే చాలా కష్టం.. ఎంత కష్టపడిన ఉద్యోగం రావడం కష్టం.. కానీ.. రాజశేఖర్ మాత్రం ఏకంగా ఐదు ఉద్యోగాలు సాధించాడు. రాసిన ప్రతి పరీక్షలో ఉద్యోగం సాధించి తన ప్రతిభను చాటరు. ఎంతో మంది యువత కు ఆదర్శంగా నిలుస్తున్నారు. పలువురు అభినందనలు చెబుతున్నారు. కరీంనగర్‌లోని మంకమ్మ తోట కు చెందిన రాజశేఖర్.. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో ఉన్నారు. దీంతో నిత్యం కష్టపడి చదివారు. అయితే ఒక్క ఉద్యోగం కాకుండా 5 ఉద్యోగాలు సాధించి ఔరా అనిపించారు. రాజశేఖర్ రాసిన టీజీటీ, పీజీటీ, జూనియర్ లెక్చరర్, గ్రూప్ 4, తాజాగా ఫలితాలు ప్రకటించిన టీజీపీఎస్సీ జూనియర్ లెక్చరర్ ఇంగ్లీష్ ఉద్యోగాలు సాధించి తన ప్రతిభను చాటారు.

ఇప్పటికే గంగాధర బీసీ వెల్ఫేర్ స్కూల్‌లో ఇంగ్లీష్ టీచర్‌గా పనిచేస్తున్నారు. ప్రతి పరీక్షను సవాలుగా తీసుకొని చదివారు. దీంతో..సబ్జెక్టు ఫై పట్టు సాధించారు. ఒకే వ్యక్తి.. ఐదు ఉద్యోగాలు సాధించడం చాలా అరుదు. ఈయన ఐదు ఉద్యోగాలు సాధించడంతో స్నేహితులు అభినందిస్తున్నారు. భవిష్యత్‌లో ఉన్నత ఉద్యోగం సాధించాలనే చెబుతున్నారు. కష్టపడి చదువుతే.. ఏదయినా సాధించవచ్చని నిరూపించారు రాజశేఖర్. ఇప్పుడు రాజశేఖర్‌ను చాలా మంది నిరుద్యోగులు ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి