అల్లు అర్జున్ తీరని కోరిక ఏంటో తెలుసా? ఇప్పటికీ అదే బాధ
23 November2024
Basha Shek
టాలీవుడ్ ఐకాన్ స్టార్ త్వరలోనే పుష్ఫ 2 సినిమాతో మన ముందుకు రానున్నాడు. డిసెంబర్ 5న ఈ మూవీ రిలీజ్ కానుంది.
ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా బాలయ్య అన్ స్టాపబుల్ టాక్ షో కు ముఖ్య అతిథిగా హాజరయ్యాడు అల్లు అర్జున్.
ఈ టాక్ షో వేదికగా తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ నకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు బన్నీ.
ఈ అన్ స్టాపబుల్ ఎపిసోడ్ లో బాలయ్య అల్లు అర్జున్ ని వాళ్ళ తాతయ్య అల్లు రామలింగయ్య గారి గురించి అడిగారు.
దీనికి అల్లు అర్జున్ సమాధానమిస్తూ.. ' అయన ఎప్పుడూ గుర్తొస్తుంటారు. తాతయ్యతో కలిసి నటించలేదనే బాధ ఉంది'.
'నేను గంగోత్రి, ఆర్య చేసినప్పుడు ఆయన ఉన్నారు. ఆర్యలో ఆయనతో చిన్న రోల్ అయినా చేయిస్తే బాగుండేది' అని ఇప్పటికీ ఫీల్ అవుతాను'
'నాకు నేషనల్ అవార్డు వచ్చినప్పుడు తాతయ్య ఉండి ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది' అని తాతను గుర్తుకు తెచ్చుకున్నాడు బన్నీ.
ప్రస్తుతం అల్లు అర్జున్ కామెంట్స్ సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్నాయి. బన్నీ ఫ్యాన్స్ వీటిని షేర్ చేస్తున్నారు.
ఇక్కడ క్లిక్ చేయండి..