Telangana: మంటకలుస్తోన్న మానవత్వం.. తండ్రి శవంతో కొడుకు డ్రామా..

మానవ సంబంధాలు అనేవి మంట కలుస్తున్నాయి. డబ్బుల కోసం ఎంతకైనా దిగజారుతున్నారు. కాసుల కక్కుర్తి కోసం శవాలను కూడా వదిలిపెట్టడం లేదు. తాజాగా యాదాద్రి జిల్లాలో ఓ కొడుకు చేసిన పనికి సభ్యసమాజం తిట్టిపోస్తోంది. ఇంతకీ ఆ కొడుకు ఏం చేశాడు.? ఏం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..

Telangana: మంటకలుస్తోన్న మానవత్వం.. తండ్రి శవంతో కొడుకు డ్రామా..
Telangana
Follow us
M Revan Reddy

| Edited By: Narender Vaitla

Updated on: Nov 24, 2024 | 11:23 AM

‘మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే’ అన్నాడో తత్త్వవేత్త. ఆయన ఏ నిమిషాన ఈ మాట చెప్పాడో కానీ సమాజంలో జరుగుతోన్న పరిణామాలు చూస్తుంటే ఇది అక్షర సత్యం అనిపించకమానదు. రోజురోజుకీ. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలుగా మారిపోతున్నాయి. ఆస్తికోసం అనుబంధాలను కూడా పక్కన పెడుతున్నారు. సోదరుడుతో ఉన్న భూ తగాదా పరిష్కారం కోసం కన్న తండ్రి శవాన్ని అడ్డుగా పెట్టుకున్నాడు ఓ కొడుకు. ఈ సమయం తప్పితే తనకు ఆస్తి రాదని.. తండ్రి అంత్యక్రియలను మూడు రోజులుగా ఆపాడు. మానవత్వం లేని ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

యాదాద్రి జిల్లా మోత్కూర్ మండలం సదర్శాపురంకు చెందిన ఆలకుంట్ల బాలయ్య, లింగమ్మ దంపతులకు ఇద్దరు కొడులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కూలీ నాలీ చేసి పిల్లలను పెంచి పెద్ద చేసి పెళ్లిళ్లు చేశారు. గ్రామంలో తనకున్న కొద్దిపాటి భూమిని ఇద్దరు కొడుకులకు సమానంగా పంచి ఇచ్చాడు. ఇదే సమయంలో బాలయ్య, తన బావమరిది రాములు.. ఇద్దరూ కలిసి పెద్ద కొడుకు నరేష్‌ అత్తగారి ఊరైన తాటిపాములలో రెండు ఎకరాలు కొనుగోలు చేశారు. ఇందులో అర ఎకరం భూమి విక్రయించి.. మిగిలిన భూమిని రాములు తన కుమార్తె.. బాలయ్య పెద్ద కోడలు (నరేష్ భార్య అరుణ) పేరిట పట్టా చేశారు.

ఈ భూమిలో చిన్న కుమారుడు సురేష్‌కు ఎలాంటి భాగం ఇవ్వలేదు. ఇందులో ఎకరం పది గుంటల భూమి తనకు వాటా రావాలంటూ.. చిన్న కొడుకు సురేష్.. పెద్ద కొడుకు నరేష్ తో నిత్యం గొడవలు జరుగుతున్నాయి. రెండు, మూడేళ్లుగా కొనసాగుతున్న ఈ వివాదంపై తల్లిదండ్రులు, పెద్ద మనుషులు చెప్పినా కొడుకులు వినలేదు. ఈ నేపథ్యంలో ఈ నెల 21న సాయంత్రం బాలయ్య అనారోగ్యంతో మృతిచెందాడు. 22న అంత్యక్రియలు నిర్వహించడానికి పెద్దకొడుకు అన్ని ఏర్పాట్లు చేశాడు. ఏళ్ల తరబడి కొనసాగుతున్న భూ వివాదం పరిష్కారం కోసం.. ఈ సమయం తప్పితే తనకు రావాల్సి ఆస్తి వాటా రాదని చిన్న కొడుకు సురేష్ భావించాడు.

భూమిలో తనకు రావాల్సిన వాటా ఇస్తానని కాగితం రాసిస్తేనే తండ్రికి తలకొరిపి పెట్టనిస్తానని చిన్న కుమారుడు సురేష్‌, అతని భార్య అడ్డుకున్నారు. మూడు రోజులపాటు ఆస్తికోసం కన్నతండ్రి భౌతికకాయాన్ని ఫ్రీజర్ లోనే ఇంటి ముందు ఉంచారు. దహన సంస్కారాలు బంద్ చేయడంతో గ్రామస్థులు, బంధువులు, మృతుని కుమార్తెలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఏది ఏమైనప్పటికీ మానవత్వం లేకుండా ఇంటి ముందే శవాన్ని గత మూడు రోజులుగా పెట్టి దహన సంస్కారాలు ఆపివేయడం పట్ల గ్రామస్తులు, బంధువులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఇద్దరు మధ్య భూ వివాదాన్ని పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో మూడు రోజుల తర్వాత అంత్యక్రియలు జరిగాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

మూడు గంటలపాటు పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన మందుబాబు
మూడు గంటలపాటు పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన మందుబాబు
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..