Electricity bills: అదే కరెంట్.. అదే వాడకం.. కానీ బిల్లు మాత్రం గుండెలు బాదుకునేలా చేస్తోంది. ఇన్నాళ్లూ ఓ లెక్క ఇప్పుడో లెక్క అంటున్నారు విద్యుత్ శాఖ అధికారులు. డెవలప్‌మెంట్ ఛార్జీల పేరుతో బాదుడుకి తెరతీశారు. ఈ బాదుడు దెబ్బకి సామాన్యుడు విలవిల్లాడిపోతున్నాడు. వందల బిల్లు వేలకు చేరితే చెల్లించేదెలా అని బోరుమంటున్నాడు. నిజామాబాద్, మహబూబ్‌నగర్, వరంగల్ సహా ఎక్కడ చూసినా విద్యుత్ బిల్లులపైనే చర్చ నడుస్తోంది. ఇంతకుముందు నెలకి 2,3 వందలొచ్చే కరెంట్ బిల్.. ఈసారి రూ.4 వేలు వచ్చేసరికి వినియోగదారులు షాకవుతున్నారు. ఏంటీ బిల్లు..? ఎందుకిలా వస్తోందంటూ గుండెలు బాదుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పుడు ఏ ఇంటి తలుపు తట్టినా వీర బాదుడు లొల్లే. విద్యుత్ బిల్లు చూసి కరెంట్ ఆఫీస్‌కి పరుగులు తీస్తున్నారు జనం. లిమిటెడ్ యూనిట్స్ విద్యుత్ వాడినా.. బిల్ మాత్రం వేలల్లో ఎందుకు వస్తుందని అధికారుల్ని ప్రశ్నిస్తున్నారు. అసలు కరెంట్ బిల్ ఎందుకు పెరిగింది.. అందులో ఏమేం యాడ్ చేశారో చూద్దాం.
డెవలప్‌మెంట్ బిల్ అంటూ..
కొత్తగా డెవలప్‌మెంట్ బిల్ ఏంటి? గతంలో ఎన్నడూ లేనిది ఇప్పుడే ఎందుకిలా బాదుతున్నారన్నది అర్థంకాని ప్రశ్నగా మారింది. వేలల్లో ఉన్న కరెంట్ బిల్లుల్ని చూసి సామాన్యులు ఘోల్లుమంటున్నారు. కూలీ పనులు చేసుకుంటూ రేకుల షెడ్డులో ఉండే తమకు ఇంత బిల్లు వస్తే ఎలా చెల్లించాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిరుపేద, మధ్య తరగతి కుటుంబాల వాళ్లు పెద్ద మొత్తంలో వచ్చిన బిల్లులను చెల్లించలేకపోతున్నారు. ఆర్థిక స్థోమతలేని వాళ్లు నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు. విధిలేని పరిస్థితుల్లో అప్పుచేయాల్సి వస్తోందంటున్నారు. అధికారులు మాత్రం అయిదారు వాయిదాలు తీసుకున్నా ఫర్వాలేదు. కానీ బిల్ మాత్రం చెల్లించాల్సిందేనని చెబుతున్నారు.
వందల నుంచి వేలల్లో..
నిజామాబాద్ జిల్లాలో కూలీ పనిచేసుకునే ఓ వ్యక్తికి ఇంతకుముందు నెలకి రూ. 400 కరెంట్ బిల్లు వచ్చేది. ఈ సారి 4వందల బిల్లుతో పాటు డెవలప్‌మెంట్ ఛార్జీలతో కలిపి 3వేల బిల్లు వచ్చింది. కూలీ పని చేసుకునే వాళ్లకు సైతం వేలల్లో కరెంట్ బిల్లులు వస్తున్నాయి. రెక్కాడితే కానీ డొక్కాడని తమకు అధిక మొత్తంలో బిల్లులు వేయడమేంటని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో వినియోగిస్తున్నట్టుగానే ఇప్పుడు విద్యుత్ వినియోగిస్తున్నాం. మరి ఛార్జీల్లో మాత్రం అంత తేడా ఎందుకొస్తుందని ప్రశ్నిస్తున్నారు. నిరుపేద, మధ్య తరగతి కుటుంబాల వాళ్లు పెద్ద మొత్తంలో వచ్చిన బిల్లులను చెల్లించలేకపోతున్నారు. ఆర్థిక స్థోమతలేని వాళ్లు నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు. విధిలేని పరిస్థితుల్లో అప్పుచేయాల్సి వస్తోందంటున్నారు. అధికారులు మాత్రం అయిదారు వాయిదాలు తీసుకున్నా ఫర్వాలేదు. కానీ బిల్ మాత్రం బరాబర్ చెల్లించాల్సిందేనని చెబుతున్నారు.
Also Read:Sreemukhi: పరువాలతో సెగలు పుట్టిస్తున్న యాంకర్ శ్రీముఖి.. అదిరిన పిక్స్
అదిరే అందాలతో కవ్విస్తోన్న యాంకర్ రష్మి గౌతమ్