Telangana: పాఠశాల ముసుగులో పాడు పనులు.. ఆరా తీయగా బయటపడిన షాకింగ్ విషయాలు..

|

Oct 08, 2021 | 9:25 AM

Telangana: ప్రస్తుతం కాలంలో మోసగాళ్లు మరీ ఎక్కువైపోతున్నారు. ప్రజల అవసరాలు, ఆశలను ఆసరగా చేసుకుని దర్జాగా అందినకాడికి దండుకుంటున్నారు.

Telangana: పాఠశాల ముసుగులో పాడు పనులు.. ఆరా తీయగా బయటపడిన షాకింగ్ విషయాలు..
Fir
Follow us on

Telangana: ప్రస్తుతం కాలంలో మోసగాళ్లు మరీ ఎక్కువైపోతున్నారు. ప్రజల అవసరాలు, ఆశలను ఆసరగా చేసుకుని దర్జాగా అందినకాడికి దండుకుంటున్నారు. తాజాగా మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలో నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పట్టణంలో మూతపడిన ఓ ప్రైవేట్‌ పాఠశాల నుంచి ఎంఈవో సంతకం ఫోర్జరీ చేసి టీసీ, బోనఫైడ్‌ ధ్రువపత్రాలు జారీ చేసిన ఘటన బయటపడింది. దీనిపై కూపీ లాగిన పోలీసు అధికారులకు దిమ్మతిరిగే వాస్తవాలు వెలుగు చూశాయి. వివరాల్లోకెళితే.. ఇటీవల గురుకులం, ఆదర్శ, జ్యోతిబా పూలే, నవోదయ పాఠశాలల్లో అర్హత సాధించిన విద్యార్థులు పాఠశాలలో చేరేందుకు తమ ఓరిజినల్‌ ధ్రువీకరణ పత్రాలను సమర్పించారు. అయితే, ఈ సర్టిఫికెట్లపై అధికారులకు అనుమానం రావడంతో ఆరా తీశారు. దీంతో ఈ సర్టిఫికెట్ల దందా వెనుక ఉన్న అసలు బాగోతం బయటపడింది.

పన్నేండేళ్ల క్రితం మూతపడిన పాఠశాల నుంచి విద్యార్థులు ధ్రువీకరణ పత్రాలు పొందినట్లు అధికారులు గుర్తించారు. ఈ పత్రాలపై మందమర్రి మండలం, ఆదిలాబాద్‌ జిల్లా పేరుతో స్టాంపు ఉండడంతో పాటు మండల విధ్యాధికారి సంతకం కూడా ఫోర్జరీ చేసినట్లు గుర్తించారు. కాసిపేట, బెల్లంపల్లి, మందమర్రి మండలాల్లోని ప్రభుత్వ విద్యా సంస్థల్లో వివిధ తరగతుల్లో చేరేందుకు 15 మంది నకిలీ ధ్రువపత్రాలు తీసుకున్నట్లు గుర్తించారు అధికారులు. అయితే, ఒక్కో విద్యార్థికి ధ్రువీకరణ పత్రం ఇచ్చేందుకు మూతపడిన పాఠశాల యాజమాన్యం 3 వేల నుంచి 10వేల రూపాయలు తీసుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

కాగా, నకిలీ ధ్రువపత్రాలతో గురుకులం పాఠశాలలో సీటు పొందిన 15 మంది విద్యార్థుల సీట్లను రద్దు చేసినట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. మూత పడిన ప్రగతి విద్యానికేతన్ పాఠశాల యాజమాన్యంపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు మండల విద్యాశాఖ అధికారి జాడి పోచయ్య తెలిపారు. అధికారుల ఫిర్యాదు మేరకు ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also read:

IPL 2021: ప్లేఆఫ్స్‌లో అమీతుమీ పోరుకు అంతా సిద్దం.. ముంబై ఆశలు గల్లంతు.!

NASA 16 Psyche: ఆ ఉల్క భూమికి చేరితో ప్రతీ ఒక్కరూ కోటీశ్వరులే!.. నాసా పరిశోధనలో షాకింగ్ అంశాలు..

Garuda Puranam: ఈ 5 విషయాలు తెలుసుకోండి.. లేదంటే దరిద్రానికి, దురదృష్టానికి ఆహ్వానం పలికినట్లే.!