AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anjani Kumar Meets CM KCR: సీఎం కేసీఆర్‌ను కలిసిన నూతన డీజీపీ అంజనీ కుమార్‌.. శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు

తెలంగాణ నూత‌న డీజీపీగా అంజ‌నీ కుమార్ శ‌నివారం బాధ్యతలు స్వీకరించారు. మధ్యాహ్నం డీజీపీ కార్యాలయానికి చేరుకున్న అంజ‌నీ కుమార్.. మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి నుంచి బాధ్యతలు స్వీకరించారు.

Anjani Kumar Meets CM KCR: సీఎం కేసీఆర్‌ను కలిసిన నూతన డీజీపీ అంజనీ కుమార్‌.. శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు
Cm Kcr Ts Dgp
Shaik Madar Saheb
|

Updated on: Dec 31, 2022 | 5:01 PM

Share

తెలంగాణ నూత‌న డీజీపీగా అంజ‌నీ కుమార్ శ‌నివారం బాధ్యతలు స్వీకరించారు. మధ్యాహ్నం డీజీపీ కార్యాలయానికి చేరుకున్న అంజ‌నీ కుమార్.. మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి నుంచి బాధ్యతలు స్వీకరించారు. అంజనీ కుమార్ డీజీపీగా బాధ్యతలు స్వీకరించే కార్యక్రమంలో మాజీ డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి, సీపీలు సీవీ ఆనంద్, మ‌హేశ్ భ‌గ‌వ‌త్‌తో పాటు ప‌లువురు పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా అంజ‌నీ కుమార్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

ఇదిలాఉంటే.. రాష్ట్ర డీజీపీగా బాధ్యతలను స్వీకరించిన అనంతరం అంజనీ కుమార్.. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును మర్యాదపూర్వకంగా కలిసారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ప్రగతి భవన్ కు వెళ్లి సీఎం కేసీఆర్ ను కలిశారు.

ఇవి కూడా చదవండి
Cm Kcr Dgp

Cm Kcr Dgp

తనకు డీజీపీగా అవకాశం కల్పించినందుకు సీఎం కెసిఆర్ కు అంజనీ కుమార్ కృతజ్జతలు తెలిపారు. ఈ సందర్భంగా డీజీపీ అంజనీ కుమార్ కు సిఎం కెసిఆర్ శుభాకాంక్షలు తెలిపారు.

మహేందర్ రెడ్డి నుంచి డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన అంజనీ కుమార్..

అంతకుముందు తెలంగాణ స్టేట్ పోలీసు అకాడ‌మీలో మ‌హేంద‌ర్ రెడ్డి ప‌ద‌వీ విర‌మ‌ణ కార్యక్రమాన్ని ఈ రోజు ఉదయం ఘనంగా నిర్వహించారు. అనంతరం అంజనీ కుమార్ కు పోలీసులు స్వాగతం పలికారు. లక్డీకపూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని పోలీస్ హెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్వార్టర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఈ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..