Telangana: చెట్టుదగ్గర 30ఏళ్లుగా ఉన్న విగ్రహం.. భక్త రామదాసు మొదటి విగ్రహంగా నేడు గుర్తింపు..
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి పోలీస్ స్టేషన్లో ఎన్నో ఏళ్లుగా ఉన్న ఓ పురాతన విగ్రహాన్ని భక్త రామదాసు విగ్రహం గా గుర్తించారు పురావస్తు శాఖ అధికారులు. ముప్పై సంవత్సరాలుగా స్టేషన్ ఆరుబయట ఉన్న విగ్రహాన్ని దేవుడి విగ్రహం గా భావించి అప్పట్నుంచి పూజలు చేస్తున్నారు.స్టేషన్ లో ఉన్న విగ్రహాన్ని ఫొటో తీసి పురావస్తు శాఖ అధికారులకు పంపించడంతో వారు నేలకొండపల్లి వచ్చి పలు పరిశోధనలు చేసిన అనంతరం అది భక్తరామదాసు విగ్రహం గా గుర్తించారు.
భద్రాద్రి ఆలయ నిర్మాత, పరమ భక్తి గ్రేశ్వరుడు, వాగ్గేయకారుడు భక్త రామదాసు కు సంబంధించిన విగ్రహాలను ఆయన రూపానికి సంబంధించిన ఆనవాళ్లను తెలియజేసేలా స్పష్టమైన ఆధారాలు లేవు. తొలిసారి ఖమ్మం జిల్లా నేలకొండపల్లి పోలీస్ స్టేషన్ లో భక్త రామదాసు విగ్రహం లభ్యం అయింది. ఇప్పటివరకు ఈ విగ్రహ సంబంధించిన అవశేషాలను ఎవరు గుర్తించకపోవడంతో పోలీస్ స్టేషన్లో ఓ పక్కన విగ్రహం ఉంది. ఈ విగ్రహాన్ని నేలకొండపల్లి ఎస్ఐ సతీష్ నేలకొండపల్లికి చెందిన ఓ సామాజిక కార్యకర్త విగ్రహాలను పరిశీలించి పురావశాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. వారు ఆ విగ్రహాన్ని పరిశీలించి అది భక్త రామదాసు విగ్రహంగా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. భక్త రామదాసు కు సంబంధించిన తొలి విగ్రహం ఇది కావటం విశేషం.
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి పోలీస్ స్టేషన్లో ఎన్నో ఏళ్లుగా ఉన్న ఓ పురాతన విగ్రహాన్ని భక్త రామదాసు విగ్రహం గా గుర్తించారు పురావస్తు శాఖ అధికారులు. ముప్పై సంవత్సరాలుగా స్టేషన్ ఆరుబయట ఉన్న విగ్రహాన్ని దేవుడి విగ్రహం గా భావించి అప్పట్నుంచి పూజలు చేస్తున్నారు.స్టేషన్ లో ఉన్న విగ్రహాన్ని ఫొటో తీసి పురావస్తు శాఖ అధికారులకు పంపించడంతో వారు నేలకొండపల్లి వచ్చి పలు పరిశోధనలు చేసిన అనంతరం అది భక్తరామదాసు విగ్రహం గా గుర్తించారు.
గతంలో రామదాసు ధ్యాన మందిరం సమీపంలో పోలీస్ స్టేషన్ ఉండేది.స్టేషన్ నిర్మాణం చేసి చాలా సంవత్సరాలు కావడం తో కూలిపోయింది. దీంతో అధికారులు మరో చోట పోలీస్ స్టేషన్ బిల్డింగ్ నిర్మాణం చేశారు. పాత భవనంలో ఉన్న విగ్రహాన్ని నూతనంగా నిర్మించిన స్టేషన్ కు తీసుకొచ్చిన అధికారులు ఆరుబయట ఉంచి విగ్రహానికి పూజలు నిర్వహిస్తున్నారు. తాజాగా పురావస్తు శాఖ అధికారులు ఆ విగ్రహాన్ని భక్తరామదాసు విగ్రహంగా గుర్తించారు.దీంతో రామదాసు ధ్యాన మందిరానికి విగ్రహాన్ని తరలించి ఆయన 10 వ తరం వారసులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..