‘జీవితం చాలా చిన్నది సర్..’ పెళ్లయి ఏడాది తిరగకముందే ఆ భార్యాభర్తలు చేసిన పనికి.!
'జీవితం చాలా చిన్నది సర్..' పెళ్లయి ఏడాది తిరగకముందే ఆ భార్యాభర్తలు చేసిన పనికి.. ఆ ఊరంతా దిగ్బ్రాంతి చెందింది. అయ్యో.! పాపం అని అందరూ కన్నీటి పర్యంతం అయ్యారు. క్షణికావేశంలో చేయకూడదని పని చేశారు.. అందరికీ దూరమయ్యారు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
ఆదిలాబాద్ జిల్లా, జనవరి 27: ‘జీవితం చాలా చిన్నది సర్.. భార్యాభర్తలిద్దరూ గొడవలు పడకుండా.. ఒకరికొకరు తోడుగా ఉంటూ.. జీవితాంతం ఆనందంగా ఉండాలని’ కోరుకుంటూ ఉంటారు పెద్దలు. అయితే ఈ మధ్యకాలంలో చిన్న చిన్న గొడవలకు సైతం భార్యాభర్తలు క్షణికావేశంలో పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రాణాలకు సైతం లెక్కచేయకుండా.. బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. తాజాగా భార్యాభర్తలు బలవన్మరణానికి పాల్పడిన ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. పెళ్లై ఏడాది తిరగక ముందే క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం నవ జంటను విగత జీవులుగా మార్చింది. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలోని కొల్హారి గ్రామానికి చెందిన చోపాడే విజయ్‌కి.. పల్లవితో 8 నెలల క్రితం వివాహమైంది. శుక్రవారం భార్య పల్లవి క్షణికావేశంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిగా.. కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె శుక్రవారం రాత్రి మృతి చెందింది.
ఇక భార్య మృతిని జీర్ణించుకోలేని భర్త విజయ్.. అదే రోజు ఆదిలాబాద్ పట్టణంలోని విమల్ గ్యాస్ ఏజెన్సీ సమీపంలో రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. విజయ్ అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. భార్యభర్తలిద్దరూ ఒకే రోజు చనిపోవడంతో వారి గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి. భార్యాభర్తల బలవన్మరణాలకు కుటుంబ కలహాలు కారణం కావొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్న పోలీసులు..ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..