Lok Sabha Elections: తెలంగాణలో ఎవరి లెక్కలు ఎలా.. లోక్ సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు..

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల హడావుడి మొదలైంది. ప్రధాన పార్టీలు పార్లమెంట్ ఎన్నికలపై కసరత్తు ముమ్మరం చేశాయి. బీఆర్ఎస్‌ అధిష్ఠానం కూడా స్పెషల్‌ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే లోక్‌సభ నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేశారు బీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్. వచ్చే నెలలో ఎన్నికల షెడ్యూల్‌ విడుదల అవుతుందన్న ప్రచారంతో గులాబీ బాస్‌ ఎంపీ అభ్యర్థులపై కసరత్తు మొదలుపెట్టారు.

Lok Sabha Elections: తెలంగాణలో ఎవరి లెక్కలు ఎలా.. లోక్ సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు..
Telangana
Follow us
Srikar T

|

Updated on: Jan 27, 2024 | 11:30 AM

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల హడావుడి మొదలైంది. ప్రధాన పార్టీలు పార్లమెంట్ ఎన్నికలపై కసరత్తు ముమ్మరం చేశాయి. బీఆర్ఎస్‌ అధిష్ఠానం కూడా స్పెషల్‌ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే లోక్‌సభ నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేశారు బీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్. వచ్చే నెలలో ఎన్నికల షెడ్యూల్‌ విడుదల అవుతుందన్న ప్రచారంతో గులాబీ బాస్‌ ఎంపీ అభ్యర్థులపై కసరత్తు మొదలుపెట్టారు. గత లోక్‌సభ ఎన్నికల సమయంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్.. కారు- సారు-పదహారు నినాదంతో 9 సీట్లు గెలిచింది. అయితే ఈసారి అధికారంలో లేకపోవడంతో మరింత శ్రమించి ఎక్కువ స్థానాలను గెల్చుకోవాలని వ్యూహాలు రచిస్తోంది.

ఇక బీజేపీ పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని కరీంనగర్ నుంచి మొదలుపెట్టాలని డిసైడ్ అయింది. 2019 ఎన్నికల్లో 4 ఎంపీలు గెలిచిన కమలం పార్టీ.. అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల శాతం పెరగడంతో డబుల్‌ డిజిట్‌ మార్క్‌కు చేరాలని టార్గెట్‌గా పెట్టుకుంది. దీనిలో భాగంగా రేపు కేంద్రహోంమంత్రి అమిత్ షా కరీంనగర్‌లో బీజేపీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తారు. మరోవైపు కాంగ్రెస్‌ పార్టీ కూడా టార్గెట్‌ ఫిక్స్‌ చేసుకుంది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచే లోక్‌సభ ఎన్నికలే టార్గెట్‌ దూసుకెళ్తోంది. 2019 ఎన్నికల్లో 3 సీట్లకే పరిమితమైన కాంగ్రెస్‌ పార్టీ.. ఈసారి అధికారంలో కూడా ఉండడంతో 12 నుంచి 14 సీట్లు గెలవాలని పీసీసీ నేతలు లెక్కలు వేస్తున్నారు. తెలంగాణలో మొత్తం 17 లోక్‌సభ స్థానాలు ఉండగా.. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల మధ్యే ప్రధానంగా పోటీ ఉండనుంది. అయితే ఇప్పటికే టార్గెట్‌ ఫిక్స్‌ చేసుకున్న మూడు పార్టీలు.. త్వరలోనే అభ్యర్థులను ప్రకటించేందుకు కసరత్తు చేస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..