
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు కౌంట్‌డౌన్ కొనసాగుతోంది. అధికారులంతా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. భారీ భద్రత మధ్య బుధవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం అవుతుంది. ఓటింగ్ శాతం పెంచేందుకు అధికార యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక నిఘా పెట్టారు. ఈ క్రమంలో.. పోలింగ్ రోజున ఆయా కార్పోరేషన్, మున్సిపల్ పరిమితుల్లో సెలవు ప్రకటించాలని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. ఫిబ్రవరి 11న రాష్ట్రవ్యాప్తంగా 116 మునిసిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లు పోలింగ్ జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో.. సెలవు ప్రకటించారు.. దీంతో యా కార్పోరేషన్, మున్సిపల్ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు ముసి వేయనున్నారు.
ప్రజాస్వామ్య ప్రక్రియలో.. ఎక్కువ ఓటింగ్ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం, పౌరులందరికీ.. ఓటింగ్ అందుబాటులో ఉంచడం.. ఈ సెలవుదినాన్ని ప్రకటించడం వెనుక ఉన్న ప్రాథమిక లక్ష్యం అని ఎన్నికల కమిషన్ అధికారులు తెలిపారు.
పోలింగ్ ప్రాంతాలలో ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థలు, సహకార సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలకు ఈ సెలవు వర్తిస్తుంది. పరిపాలనా వ్యవస్థ ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించడానికి పూర్తిగా మద్దతు ఇచ్చేలా ఏర్పాట్లు చేశారు..
అనేక విద్యాసంస్థలు పోలింగ్ కేంద్రాలుగా ఉపయోగించబడుతున్నందున, ఫిబ్రవరి 11న ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, అలాగే కళాశాలలు రెండూ మూసివేయనున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ భవనాలను ముందుగానే స్వాధీనం చేసుకుని ఓటింగ్ ప్రక్రియకు అవసరమైన అన్ని సన్నాహాలను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో ఎన్నికలు జరగనున్న మున్సిపల్, కార్పోరేషన్ పరిధిలో సెలవు అమలు కానుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..