Telangana Municipal Election 2021: తెలంగాణలో కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్

|

Apr 15, 2021 | 1:45 PM

Telangana Municipal Election 2021: తెలంగాణలో మరో ఎన్నికల నగరా మోగింది. రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీల్లో....

Telangana Municipal Election 2021: తెలంగాణలో కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్
Telangana Municipal Election 2021
Follow us on

Telangana Municipal Election 2021: తెలంగాణలో మరో ఎన్నికల నగరా మోగింది. రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీల్లో ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం గురువారం నోటిఫికేషన్‌ను జారీ చేసింది. తెలంగాణలో ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్లు, సిద్దిపేట, జడ్చర్ల, అచ్చంపెట్, నకిరేకల్, కొత్తూరు మున్సిపల్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 16 నుంచి 18 వరకు నామినేషన్లు స్వీకరించనుననారు. 19న అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన, 22 వరకు నామినేషన్లఉప సంహరణ చేపట్టనున్నారు. ఈ నెల 30న పోలింగ్ జరగనుంది. మే 3న ఫలితాలు వెల్లడి కానున్నాయి.

రేపటి నంచే నామినేషన్ల స్వీకరణ చేపట్టనుండటంతో.. ఆయా ప్రాంతాల్లో అన్ని ఏర్పాట్లను పకడ్బంధీగా నిర్వహించాలని అధికారులకు ఎన్నికల సంఘం ఆదేశించింది. దీంతోపాటు… వివిధ కారణాలతో ఖాళీ అయిన డివిజన్లకు కూడా ఈనెల 30న పోలింగ్‌ నిర్వహించనున్నట్టు ఎన్నికల సంఘం వెల్లడించింది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని లింగోజిగూడ డివిజన్‌కు, గజ్వేల్‌, నల్గొండ, జల్‌పల్లి, అలంపూర్‌, బోధన్‌, పరకాల, మెట్‌పల్లి, బెల్లంపల్లిలో ఒక్కో వార్డుకు ఎన్నికలు నిర్వహించనున్నారు.

సిద్దిపేట పాలకమండలి పదవీకాలం ఈ రోజుతో ముగియనుంది. జడ్చర్ల, కొత్తూరు, నకిరేకల్‌ మున్సిపాలిటీలు కొత్తగా ఏర్పడ్డాయి. దీంతో రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీల్లో ఎన్నికల నిర్వహణకు ఇప్పటికే ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ రోజు ఉదయం వార్డుల వారీ రిజర్వేషన్లను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఆయా జిల్లాల కలెక్టర్లు ప్రకటించి ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా సహకరించాలని కోరారు

Also Read:

Kumbh Mela Coronavirus: హరిద్వార్‌లో ఐదు రోజుల్లో 2,167 కరోనా కేసులు.. ‘కుంభమేళా’ను కుదించలేం: అధికారులు

Bank Privatisation: మరో రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రైవేటీకరణ.. లిస్ట్ ఫైనల్ అయినట్లేనా..!