Telangana: నాంపల్లి కోర్టుకు హాజరైన మంత్రి సీతక్క… ఆనాటి కేసులో విచారణ
కరోనా టైంలో నమోదైన కేసులో నాంపల్లి స్పెషల్ కోర్టుకు మంత్రి సీతక్క హాజరయ్యారు. బీఆర్ఎస్ హయాంలో ఇందిరాపార్క్ దగ్గర సీతక్క దీక్ష చేశారు. గాంధీనగర్ పీఎస్‌లో సీతక్క, NSUI నేతలపై కేసు నమోదైంది. ఈ కేసులో విచారణకు హాజరయ్యారు మంత్రి సీతక్క. అయితే తామేం...

కరోనా టైంలో నమోదైన కేసులో నాంపల్లి స్పెషల్ కోర్టుకు మంత్రి సీతక్క హాజరయ్యారు. బీఆర్ఎస్ హయాంలో ఇందిరాపార్క్ దగ్గర సీతక్క దీక్ష చేశారు. గాంధీనగర్ పీఎస్‌లో సీతక్క, NSUI నేతలపై కేసు నమోదైంది. ఈ కేసులో విచారణకు హాజరయ్యారు మంత్రి సీతక్క. అయితే తామేం తప్పు చేయలేదు, న్యాయస్థానాలపై తమకు నమ్మకం ఉందన్నారు సీతక్క.
కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని దీక్ష చేస్తే కేసులు పెట్టారని మంత్రి సీతక్క ఆరోపించారు. బీఆర్ఎస్ నేతలు తమపై తప్పుడు కేసులు పెట్టారని విమర్శించారు. కరోనా నుంచి పేదలను కాపాడాలనే ఆరోజు పోరాటం చేశానని చెప్పారు సీతక్క.
కరోనాను ఆరోగ్యశ్రీ లో చేర్చాలని డిమాండ్ చేస్తూ ఏప్రిల్ 2021లో ఇందిరా పార్క్ వద్ద ఎన్ఎస్‌యూఐ నాయకులతో కలిసి నిరాహార దీక్ష చేశారు. ఆరోగ్యశ్రీ కింద కరోనాకు చికిత్స అందించాలని ఉచిత అంబులెన్స్ సర్వీసులు ఏర్పాటు చేయాలని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కరోనాతో మరణించిన ప్రతి కుటుంబానికి వాళ్లు ఆసుపత్రిల్లో కట్టిన బిల్లులను సీఎంఆర్ఎఫ్ కింద చెల్లించాలని కోరారు.
అయితే కరోనా నిబంధనలకు విరుద్ధంగా ఇందిరా పార్కు దగ్గర ధర్నా చేసి కరోనా వ్యాప్తి చేస్తున్నారని అప్పటి ప్రభుత్వం సీతక్కపై కేసు నమోదు చేసింది. ఈ క్రమంలో కేసు విచారణలో భాగంగా సీతక్క ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరయ్యారు.
