Telangana: ఈటెల రాజేందర్ భద్రతపై మంత్రి కేటీఆర్ ఆరా.. సెక్యూరిటీ ఇవ్వాలని డీజీపీకి సూచన..!
మాజీ మంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ తనకు ప్రాణ హానీ ఉందంటూ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్పందించిన మంత్రి కేటీఆర్.. ఈటెల భద్రతపై ఆరా తీశారు. డీజీపీ అంజనీకుమార్‌కు ఫోన్ చేసి ఈటెల భద్రతపై చర్చించారు.
మాజీ మంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ తనకు ప్రాణ హానీ ఉందంటూ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్పందించిన మంత్రి కేటీఆర్.. ఈటెల భద్రతపై ఆరా తీశారు. డీజీపీ అంజనీకుమార్‌కు ఫోన్ చేసి ఈటెల భద్రతపై చర్చించారు. బుధవారం ఉదయం డీజీపీ అంజనీకుమార్‌కు ఫోన్ చేసిన మంత్రి కేటీఆర్.. ఈటల భద్రతపై చర్చించారు. ఈటెల రాజేందర్ భద్రతపై సీనియర్ ఐపీఎస్ అధికారితో వేరిఫై చేయించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫునే సెక్యూరిటీ ఇవ్వాలని సూచించారు.
మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు ఇవాళ ఈటెల భద్రత పెంపునకు సంబంధించి సమీక్ష చేయనున్నారు డీజీపీ అంజనీకుమార్. మరికాసేపట్లో ఈటల ఇంటికి సీనియర్ ఐపీఎస్ అధికారి వెళ్లనున్నారు. రాజేందర్ భద్రత, ఆరోపణలు, సెక్యూరిటీ కల్పించే అంశంపై చర్చించనున్నారు.
కాగా, ఈటల రాజేందర్, ఆయన భార్య జమున తమ భద్రతపై సంచలన ఆరోపణలు చేశారు. రాజేందర్‌ను చంపేందుకు కొందరు కుట్రలు చేస్తున్నారని, ఇందుకోసం రూ. 20 కోట్లు ఖర్చు చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నారని అన్నారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన నేత ఒకరు ఈ కామెంట్స్ చేసినట్లు తమకు సమాచారం అందిందన్నారు. తమ కుటుంబంలో ఎవరికైనా ఏమైనా హాని జరిగితే, దానికి బాధ్యులు ముఖ్యమంత్రి కేసీఆరే అవుతారని అన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..