AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: హైదరాబాద్‌లో గుజరాత్‌ ఏటీఎస్‌ సోదాల కలకలం..అదుపులో సాఫ్ట్‌వేర్‌ ట్రైనర్‌, 18 ఏళ్ల అమ్మాయి

తెలంగాణలో ఉగ్రవాద కార్యకలాపాలు మళ్లీ కలకలం రేపుతున్నాయి. గుజరాత్‌లోని ఉగ్రవాద అనుమానితుడితో రామగుండం అమ్మాయి చాట్ చేయడం ఇప్పుడు కలకలం కలిగిస్తోంది. ఫేస్‌బుక్ ద్వారా జరిగిన పరిచయంతో ఇది సాదాసీదాగా సాగిన సంభాషణా.. లేదంటే మరేదైనా కోణం ఉందా అని తేల్చేపనిలో ఉంది ఏటీఎస్‌ (యాంటీ టెర్రరిస్ట్‌ స్క్వాడ్‌).

Telangana: హైదరాబాద్‌లో గుజరాత్‌ ఏటీఎస్‌ సోదాల కలకలం..అదుపులో సాఫ్ట్‌వేర్‌ ట్రైనర్‌, 18 ఏళ్ల అమ్మాయి
Terrorists (representative)
Basha Shek
|

Updated on: Jun 28, 2023 | 9:44 AM

Share

తెలంగాణలో ఉగ్రవాద కార్యకలాపాలు మళ్లీ కలకలం రేపుతున్నాయి. గుజరాత్‌లోని ఉగ్రవాద అనుమానితుడితో రామగుండం అమ్మాయి చాట్ చేయడం ఇప్పుడు కలకలం కలిగిస్తోంది. ఫేస్‌బుక్ ద్వారా జరిగిన పరిచయంతో ఇది సాదాసీదాగా సాగిన సంభాషణా.. లేదంటే మరేదైనా కోణం ఉందా అని తేల్చేపనిలో ఉంది ఏటీఎస్‌ (యాంటీ టెర్రరిస్ట్‌ స్క్వాడ్‌). ప్రస్తుతం అనుమానాలగానే చెప్పిన గుజరాత్‌ ఏటీఎస్‌ అధికారులు.. సదరు బాలికను హైదరాబాద్‌ తరలించారు. ఆమె ఫోన్‌, సంభాషణలు పరిశీలించిన తర్వాత ఓ క్లారిటీ ఇస్తామన్నారు. ఏటీఎస్‌అదుపులో ఉన్న బాలిక వయసు 18 ఏళ్లు. ఆరోతరగతి తర్వాత చదువు ఆపేసింది. తరచూ మొబైల్‌లో ఉంటుంటే గేమ్స్ ఆడుతుంది అనుకున్నాం అంటున్నారు తల్లిదండ్రులు. ఏటీఎస్‌ అధికారులు వచ్చే వరకూ ఆమె సోషల్ మీడియా అకౌంట్స్‌ గురించిగానీ, ఆమె చాటింగ్స్ గురించిగానీ తెలియదంటున్నారు. అయితే అధికారులు చెప్పింది కూడా కేవలం అనుమానాలే అని, ఎలాంటి టెర్రర్ కోణాలను ధృవీకరించలేదని చెబుతున్నారు.

మరోవైపు హైదరాబాద్‌లోనూ విస్తృత సోదాలు నిర్వహిస్తున్నారు ఏటీఎస్‌ అధికారులు. హైదరాబాద్‌లోని పలు ప్రాంతల్లో తనిఖీలు చేస్తున్నాయి. ఈక్రమంలో రామగుండంలో ఒకరు, వరంగల్‌లో ఇద్దురు, హైదరాబాద్‌లో ఇద్దరు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. సోమవారం రాత్రి కాలాపత్తర్‌ కు చెందిన (41) అదుపులోకి తీసుకున్న ఏటీఎస్‌ అధికారులు పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఇక టోలిచౌకి లో నివాసం ఉంటున్న మొహమ్మద్ జవీద్‌ను అదుపులోకి తీసుకున్నారు. అమీర్‌‌పేటలోని ఓ కోచింగ్ సెంటర్‌లో సాఫ్ట్‌వేర్ ట్రైనర్‌గా జవీద్ పని చేస్తున్నారు. బక్రిద్ సందర్భంగా నాలుగు రోజుల క్రితం ఆయన తన కూతురితో రామగుండం వెళ్లారు. కోచింగ్ సెంటర్ కేంద్రంగా జవీద్ కార్యకలాపాలపై అరా తీస్తోంది ఏటీఎస్‌. ఈక్రమంలో అమీర్ పేటను జల్లెడ పడుతున్నారు. నాలుగు కోచింగ్ సెంటర్ ల సీసీ కెమెరా ఫుటేజ్ పరిశీలిస్తున్నారు. కోచింగ్ మాటున ఉగ్ర శిక్షణ ఇచ్చినట్టు అనుమానిస్తున్నారు గుజరాత్ ఏటీఎస్‌ అధికారులు. వీరి వివరాలను పూర్తిగా ఆరా తీసే పనిలో నిమగ్నమయ్యారు ఏటీఎస్ అధికారులు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి
Follow Us
ఏడేళ్ల బాలికపై లైంగిక దాడి.. పోలీసుల అదుపులో నిందితుడు
ఏడేళ్ల బాలికపై లైంగిక దాడి.. పోలీసుల అదుపులో నిందితుడు
టిప్పర్ కేబిన్‌లో చిక్కుకుని విలవిలలాడిన డ్రైవర్..!
టిప్పర్ కేబిన్‌లో చిక్కుకుని విలవిలలాడిన డ్రైవర్..!
రూ.9కే చీర.. షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో తోపులాట..!
రూ.9కే చీర.. షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో తోపులాట..!
కస్టమర్లకు అలర్ట్‌.. వరుసగా బ్యాంకులు బంద్‌.. ఎప్పటి నుంచి అంటే..
కస్టమర్లకు అలర్ట్‌.. వరుసగా బ్యాంకులు బంద్‌.. ఎప్పటి నుంచి అంటే..
కోసిన బంగాళాదుంపలు నల్లగా మారుతున్నాయా? తెల్లగా, తాజాగా ఉండాలంటే
కోసిన బంగాళాదుంపలు నల్లగా మారుతున్నాయా? తెల్లగా, తాజాగా ఉండాలంటే
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి