Harish Rao: ప్రధాని శంకుస్థాపనల కోసం వచ్చినట్లు లేదు.. మోదీపై హరీష్‌ రావు విమర్శలు.

ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్‌కి శంకుస్థాపనల కోసం వచ్చినట్లు లేదని, తెలంగాణపై విషం కక్కేందుకే వచ్చినట్లు ఉందని తెలంగాణ మంత్రి హరీష్‌ రావు అన్నారు. మోదీ మాట్లాడిన‌ ప్రతీ మాట సత్య దూరమన్న హరీష్‌ రావు... ప్రధానిగా ఇన్ని అబద్ధాలు ఆడడం మోదీకే చెల్లిందన్నారు. తన వల్లే డిబిటి..

Harish Rao: ప్రధాని శంకుస్థాపనల కోసం వచ్చినట్లు లేదు.. మోదీపై హరీష్‌ రావు విమర్శలు.
Harish Rao

Updated on: Apr 08, 2023 | 8:42 PM

ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్‌కి శంకుస్థాపనల కోసం వచ్చినట్లు లేదని, తెలంగాణపై విషం కక్కేందుకే వచ్చినట్లు ఉందని తెలంగాణ మంత్రి హరీష్‌ రావు అన్నారు. మోదీ మాట్లాడిన‌ ప్రతీ మాట సత్య దూరమన్న హరీష్‌ రావు… ప్రధానిగా ఇన్ని అబద్ధాలు ఆడడం మోదీకే చెల్లిందన్నారు. తన వల్లే డిబిటి మొదలైనట్లు అనడం పచ్చి అబద్దం.. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఆసరా పెన్షన్, రైతు బంధు వంటివి నేరుగా లబ్దిదారుల ఖాతాలో జమ అవుతున్నాయని మంత్రి గుర్తు చేశారు.ఇందులో గొప్ప చెప్పుకోవాల్సింది ఏముందని హరీష్‌ రావు ప్రశ్నించారు.

రైతు బంధును కాపీ కొడితే పీఎం కిసాన్ అయ్యిందని, పీఎం కిసాన్ వల్లే మొదటి సారి రైతులకు లబ్ది అని చెప్పుకోవడం సిగ్గు చేటని విమర్శించారు. రైతు బంధుతో పోల్చితే పీఏం కిసాన్ సాయమెంత.. అని మంత్రి నిలదీశారు. ఐటీఐఆర్‌ను బెంగళూరుకు తరలించారు. రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన వెంటనే గుజరాత్‌లో అర్బిట్రేషన్ సెంటర్ పెట్టారు. తెలంగాణ ధాన్యాన్ని కొనకుండా రైతుల కంట కన్నీరు పెట్టించారు. ఇవన్నీ చేసింది మీ ప్రభుత్వం కాదా..? అని విరుచుకుపడ్డారు మంత్రి హరీష్‌ రావు.

ఇవి కూడా చదవండి

కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం సహకారం అందించడం లేదన్న దాంట్లో ఎలాంటి నిజం లేదన్న మంత్రి.. పరిస్థితి దీనికి రివర్స్‌గా ఉందన్నారు. రాష్ట్రానికి రావాల్సిన గిరిజన యూనివర్సిటీ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు పరిశ్రమ, మెడికల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీలు, జాతీయ హోదా వంటివి ఇవ్వకుండా కేంద్రం తెలంగాణకు ఎలాంటి సహకారం అందించడం లేదని హరీష్‌ రావు స్పష్టం చేశారు. అదానీ వాదం గురించి ప్రజల దృష్టి మళ్లించడానికి.. లేని పరివార వాదం గురించి మాట్లాడడం మీకే చెల్లిందని మోదీని ఉద్దేశించి విమర్శలు గుప్పించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..