Telangana: స్కూల్‌లో బాత్రూంలో ప్రసవించిన బాలిక.. విచారణలో విస్తుపోయే విషయాలు

తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా నారాయణ్ ఖేడ్ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ లో ఈ దారుణ ఘటన జరిగింది. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోన్న బాలిక.. మార్చి నెల ఆఖరివారంలో స్కూల్ బాత్రూమ్‌లో ప్రసవించింది. ఈ ఘటనపై విద్యాశాఖ సీరియస్ అయ్యింది.

Telangana: స్కూల్‌లో బాత్రూంలో ప్రసవించిన బాలిక.. విచారణలో విస్తుపోయే విషయాలు
Minor Girl (representative image)
Follow us

|

Updated on: Apr 08, 2023 | 8:10 PM

నారాయణఖేడ్ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్‌‌ బాత్రూంలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న మైనర్ బాలిక ప్రసవించడం తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసులో బాలికను ట్రాప్ చేసిన ఇద్దరు మైనర్ బాలురను అరెస్ట్ చేసి చైల్డ్ కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. న్యాయమూర్తి వారికి రిమాండ్ విధించారు. ఈ ఘటనను విద్యశాఖ ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. ఇప్పటికే స్కూల్ ప్రిన్సిపల్ మంజుల, డిప్యూటీ వార్డెన్ నసీమ్ బేగం, స్టాఫ్ నర్స్ సంధ్యను సస్పెండ్ చేశారు అధికారులు. గత నెల చివరి వారంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఘటన జరిగిన రోజున ప్రిన్సిపల్.. తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో.. వారు అక్కడికి వచ్చి కన్నీరు పెట్టుకున్నారు. అయితే పసిపాప విషయంలో మాత్రం వారు కఠినంగా వ్యవహరించారు. బిడ్డ జీవితం నాశనం అయ్యిందని, ఈ విషయం గ్రామంలో తెలిస్తే పరువు పోతుందని భావించారో ఏమో కానీ.. కుమార్తెకు జన్మించిన పసికందును ముళ్లపొదల్లో వదిలేసి వెళ్లిపోయారు. చిన్నారి ఏడుపు విన్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో స్పాట్‌కు చేరుకున్న పోలీసులు పసి కందును ఆసుపత్రికి తరలించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి